తమిళనాట సినిమాల్లో దళపతిగా పేరు తెచ్చుకుని ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇప్పుడు చక్రబందంలో చిక్కుకున్నారనే చెప్పాలి. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరిట పార్టీ పెట్టిన విజయ్.. మరో 7 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో 41 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాట రాజకీయ ప్రకంపనలను రేపింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం విజయ్ కు ఫోన్ చేసి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.
ఈ ఫోన్ కాల్… అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి బృందాలు తమిళనాడు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలోనే చోటుచేసుకుంది. ఇప్పటిదాకా విజయ్ ఏ పార్టీతోనూ పొత్తు లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కరూర్ ఘటనతో విజయ్ పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్ కు ఇప్పుడు ఇండియా కూటమి గానీ లేదంటే ఎన్డీఏ కూటమి మద్దతు గానీ తప్పనిసరిగా అవసరం అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరి విజయ్ ఎవరి వైపు మొగ్గుతారన్నది ఆసక్తికరంగా మారింది.
తమిళనాడులో ఇండియా కూటమిలోని కీలక భాగస్వామి డీఎంకే అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. రాహుల్ ఫోన్ చేశారన్న భావనతో డీఎంకే సర్కారు విజయ్ ను, ఆయన పార్టీని రక్షించవచ్చు గానీ… దాని పరిణామాలు చాలా ఘాటుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు విజయ్ మద్దతు పలికితే… కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నేరుగా రంగంంలోకి దిగి కరూర్ ఘటనపై దర్యాప్తు అంటూ సతాయించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఎన్నికల
సంఘానికి ఫిర్యాదు చేసి ఏకంగా పార్టీని రద్దు చేయించే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ ఎన్డీఏకు విజయ్ మద్దతు తెలిపితే తమిళనాడులోని డీఎంకే సర్కారు ఆయనను క్షణాల్లో అరెస్టు చేసి సరిగ్గా ఎన్నికల ముందు ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితిని విజయ్ ఎలా దాటగలుగుతారో చూడాలి.
This post was last modified on October 1, 2025 7:36 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…