Political News

ప‌వ‌న్‌కు సైన్యంతోనే స‌మ‌స్య‌లా…!

అవును! జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సొంత పార్టీ నాయ‌కుల నుంచే వివాదాలు వ‌స్తున్నాయి. వాస్తవానికి పార్టీ నాయ‌కుల‌ను ఆయ‌న హెచ్చ‌రిస్తున్నా ఎక్కడా ప్ర‌యోజనం కనిపించడం లేదు. అటు సభలోను, ఇటు బయట కూడా నాయకులు చేస్తున్న రాజ‌కీయాలు సేనానికి స‌మ‌స్య‌గా మారాయి.

సభలో జ‌న‌సేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమస్యలపై చర్చించాలని ఇటీవ‌ల అసెంబ్లీ సమావేశాల‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశించారు. అయితే సగం మంది ఎమ్మెల్యేలు కూడా సరిగా సభకు రాలేదు. ఇది పెద్ద మైన‌స్‌.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీ ముఖ్యనేత, మంత్రి నాదెండ్ల మనోహ‌ర్ సభలోనే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “సభ్యులు పలచ‌గా ఉన్నారు. మీరేమో ముఖ్య‌మ‌ని చెబుతున్నారు” అని ఉపసభాప‌తి మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన‌ప్పుడు, “మా సభ్యులు (జ‌న‌సేన‌) ఉన్నారు అధ్య‌క్షా” అని ఆయ‌న సమర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో, “ఆ సభ్యులు లేరు (వైసీపీ). మీ సభ్యులు కూడా లేరు.. కానివ్వండి” అని వ్యాఖ్యానించారు. మంత్రి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు పట్టుమని 10 మంది కూడా సభలో కనిపించలేదు.

వాస్తవానికి గత ఎన్నికల్లో జ‌న‌సేన తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తాజాగా సభకు మాత్రం కేవలం 12-13 మంది మాత్రమే హాజ‌ర‌య్యారు. ఒక రోజు అయితే ఏడుగురు కూడా రాలేదు. ఇది రికార్డులే చెబుతున్న మాట. దీనికి కారణాలు ఏమీ లేవ‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు కారణంగా వారు రాలేద‌ని అంటున్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడు జరగాల్సినవి ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండానే జరుగుతున్నాయి. దీనిలో వారి పాత్ర త‌క్కువగానే ఉంది. అయినా ఈ విషయాన్ని చెప్పి వారు సభకు డుమ్మా కొడుతున్నారు.

ఇక నెల్లిమ‌ర్ల, తిరుప‌తి, పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాలు జ‌న‌సేనకు సెగ పెడుతున్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శ‌లు వస్తున్నాయి. అనుకూల మీడియాలోనే వ్యతిరేక కథ‌నాలు వస్తుండటం గ‌మ‌నార్హం. వీటిని ఖండించాల‌ని ప్రయత్నిస్తున్నా మీడియా ప్రతినిధులు వాస్తవాలను ఫొటోలు, ఆడియోలు, వీడియోల రూపంలో చూపిస్తున్నారు. దీంతో పార్టీ అగ్రనేత ఈ సమస్యల నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం.

ఏదేమైనా, సేనానికి సేనతోనే ఇబ్బందులు వస్తున్నాయన్నది వాస్తవం.

This post was last modified on September 30, 2025 6:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

7 minutes ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

17 minutes ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

2 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

2 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

2 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

3 hours ago