బీఆర్ ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురై.. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన మాజీ ఎంపీ కవిత దారెటు? ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఏ విధంగా అడుగులు వేస్తారు? ఇప్పుడు ఇదీ.. రాజకీయ వర్గాల్లో జరుగుతున్న జోరు చర్చ. దీనికి కారణం.. స్థానిక ఎన్నికల సమరమే!. ఆమె ప్రస్తుతం సొంత పార్టీ ఏర్పాటుపై తలమునకలయ్యారన్నే చర్చ సాగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రకటించిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్.. తదుపరి ఆమె తీసుకునే నిర్ణయం వంటివాటిపై ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీల్లో పార్టీ గుర్తుపై ఎన్నికలు జరగకపోయినా.. పార్టీలు బలపరిచిన అభ్యర్థులే రంగంలోకి దిగుతారు. ఇక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీల గుర్తులపైనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా తెలంగాణ వేడెక్కింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్‌ల మధ్యే కీలక పోటీ ఉండే అవకాశం ఉన్నా.. బీజేపీ సహా ఇతర పార్టీల ప్రభావం కూడా స్థానిక ఎన్నికల్లో కనిపించనుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కవిత వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది. తండ్రి కేసీఆర్ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చేసినా .. తండ్రి పేరును మాత్రం ఆమె వదిలి పెట్టడం లేదు. పైగా ఇటీవల తన తండ్రి పుట్టిన ఊరు చింతకుంటకు వెళ్లి బతుకమ్మ సంబరాల్లోనూ పాల్గొన్నారు. మహిళల్లో తన హవా తగ్గకుండా చూసుకుంటున్నారు. అదే సమయంలో జాగృతి తరఫున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో కవిత ఎలాంటి పాత్ర పోషిస్తారు? అనేది కీలకంగా మారింది. సొంత పార్టీ పెట్టుకునేందుకు ఇంకా సమయం ఉంది.
అప్పటి వరకు వేచి చూడకుండా.. ప్రస్తుతం వచ్చిన స్థానిక సంస్థలలో తన తరఫున అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే.. తన తండ్రి, మాజీ సీఎం ఫొటోను పెట్టుకునే కవిత రాజకీయాలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు లేదా.. సానుభూతిపరులలో చీలిక వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేమని కూడా అంటున్నారు. ఈ రెండు జరకపోయినా.. అధికార పార్టీకి మేలు చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఏదేమైనా.. కవిత నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.
This post was last modified on September 29, 2025 4:56 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…