రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వచ్చే నెల నాలుగో తేదీన “ఆటో డ్రైవర్ల సేవలో” అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై పెద్ద ప్రభావం పడింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను పోషించుకోవడం భారంగా ఉందని కూడా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఆటో డ్రైవర్‌కు ఏడాదికి 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. తద్వారా మహిళలకు కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని నిరవధికంగా కొనసాగించడంతో పాటు ఆటో డ్రైవర్ల సమస్యలను కూడా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, ఇది ఊహించని పథకం. అంటే గత ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాలలో ఆటో డ్రైవర్ల సాయం ఎక్కడా లేదు. కానీ, అనుబంధంగా వచ్చిన సమస్యను పరిష్కరించేందుకు ఇప్పుడు కొత్త పథకాన్ని భుజాలపై ఎత్తుకోవాల్సి వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల సంఖ్యను పరిశీలిస్తే సుమారు నాలుగు లక్షల వరకు ఉందని అంచనా వేశారు. వీరందరికీ 15 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తే సుమారు 400 కోట్ల రూపాయలు ఏడాదికి ప్రభుత్వంపై భారం పడనుంది. మరి ఇంత భారం ప్రభుత్వం మోయగలదా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే మోసే అవకాశం లేదు. అయినప్పటికీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం 400 కోట్ల రూపాయల భారాన్ని కూడా భరించేందుకు ముందుకు వచ్చింది.
ఇది మంచి పరిణామం అయినప్పటికీ ఏడాదికి 15 వేల రూపాయలు అంటే తమకు ఏ మూలకు సరిపోతాయని, నెలకు వెయ్యి రూపాయలకే మించి పడటం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. అంటే ఒకవైపు వారికి సహాయం చేస్తూనే మరోవైపు చేయలేదనే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.
గత వైసిపి హయాంలో కూడా ఆటో డ్రైవర్లకు “వాహన మిత్ర” పథకం కింద 10 వేల రూపాయలు ఇచ్చారు. అప్పట్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం లేకపోవడంతో పాటు ఇతర ఉచిత రవాణా పథకాలేవీ లేవు.
దీంతో ఆటో డ్రైవర్లకు 10 వేల రూపాయలు కిట్టుబాటు అయ్యింది. కానీ ఇప్పుడు వారికి కిరాయిలు తగ్గాయి. అదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు అమలవుతున్న నేపథ్యంలో ఆటోలు ఖాళీగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం 15 వేల ఇస్తున్నప్పటికీ వారికి ఏమాత్రం సరిపోవడంలేదని చెబుతున్నారు.
మొత్తంగా ప్రభుత్వం ఇస్తున్నామని చెబుతోంది… అటువైపు డ్రైవర్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుందనేది భవిష్యత్తులో చూడాలి.
This post was last modified on September 29, 2025 6:52 am
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…