ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజనరీ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నాయకత్వానికి తిరుగు లేదన్న వాదన కూడా ఉంది. అయితే.. తాజాగా ఆయన నాయకత్వ లక్షణం సహా నాయకుడికి సంబంధించి కొత్త అర్థం చెప్పారు. సింహం-గొర్రెలతో పోలుస్తూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. విజయవాడలో జరిగిన స్వదేశీ బీఎస్ఎన్ఎల్ -4జీ నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ రోజు.. తన కల సాకారం అయిందన్నారు. 1995 నుంచి తాను కంటున్న కలలు నేడు సాకారం అయ్యాయని తెలిపారు.
‘రైట్ ప్లేస్.. రైట్ టైం.. రైట్ మ్యాన్’.. నరేంద్ర మోడీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే ఆయన లిడర్ షిప్‌కు కొత్త అర్థం చెప్పారు. “100 గొర్రెలను ఒక సింహం నడిపిస్తే ఆ సింహం గెలుస్తుంది. 100 సింహాలు ఒక గొర్రెను లీడ్ చేస్తే ఆ సింహం గెలవలేదు అది లీడర్షిప్.” అని అన్నారు. బిల్ గేట్స్ ని తొలిసారిగా వెళ్లి కలవాలనుకున్నప్పుడు ఇబ్బందులు వచ్చాయన్నారు. రాజకీయ నాయకులను కలవాల్సిన అవసరం లేదని గేట్స్ చెప్పారని గుర్తు చేశారు. కానీ, తన నాయకత్వ లక్షణాలు తెలుసుకున్న తర్వాత.. చాలాసేపు మాట్లాడారని తెలిపారు.
ఒకప్పుడు ఫోన్ సేవల్లో ఎమర్జెన్సీ కాల్, లైటైనింగ్ కాల్, ఆర్డినరీ కాల్ మాత్రమే ఉండేవని, ఆ సమయంలో కాల్స్ చేయాలంటే చాలా ఖర్చు అయ్యేదని చంద్రబాబు వివరించారు. ఆ సమయంలో చైనా ఈ విషయంలో చాలా ఫాస్ట్ గా ఉండేదన్న ఆయన టెక్నాలజీ గురించి సెల్ ఫోన్ సేవలను బేస్ చేసుకుని తాను ఇచ్చిన ఐడియాలను అప్పటి ప్రధానమంత్రి వాజపేయి ఆమోదించడం వలన ఈరోజు ఈ నెట్ వర్క్ ఈ స్థాయికి చేరిందని చంద్రబాబు చెప్పారు. సెల్ ఫోన్ విషయంలో తాను చూపించిన సంస్కరణలు నేడు దేశానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
“అసెంబ్లీలో నేను సెల్ఫోన్ గురించి మాట్లాడితే నవ్వుకున్నారు. సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు. ఈరోజు సెల్ ఫోన్ అనేది మల్టీపర్పస్ డివైజ్ గా మారిపోయింది. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ లో 730 సర్వీసులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు చైనా ఇతర దేశాల గురించి మాట్లాడుకునే వాళ్లం త్వరలోనే మేకింగ్ ఇండియా ద్వారా సెల్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే రోజులు వస్తాయి. దీనికి అప్పట్లో నేను చేసిన సంస్కరణలు.. చూపించిన మార్గమే కీలకం.” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates