Political News

వైసీపీ నేత పిన్నెల్లికి చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్‌!

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి గురించి రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రికీ తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బ్యాలెట్ బాక్సుల‌ను నేల‌కు విసిరికొట్టి.. పోలింగ్ బూత్‌లో అరాచ‌కం సృష్టించిన కేసులో ఆయ‌న ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఐదు సార్లు విజ‌యం ద‌క్కించుకున్న పిన్నెల్లి.. ఒక ద‌శ‌లో చెలరేగిపోయారు. అయితే.. తాజాగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు.. పిన్నెల్లి కేంద్రంగా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌నకు బ‌ల‌మైన హెచ్చ‌రిక‌లు చేశారు. ‘చెత్త‌ను ఊడ్చేశాను.. రాజ‌కీయ చెత్త‌ను కూడా ఊడ్చేస్తాను’ అంటూ చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

శ‌నివారం గుంటూరు జిల్లా మాచ‌ర్ల‌లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు ఇక్క‌డ స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. అనంత‌రం.. ఆయ‌న ఇక్క‌డ నిర్వ‌హించిన ప్ర‌జావేదిక‌లో మాట్లాడుతూ.. పిన్నెల్లి, ఆయ‌న సోద‌రుడు చేసిన రాజ‌కీయాల‌పై నిప్పులు చెరిగారు. తాను గ‌తంలో మాచ‌ర్ల‌లో ప‌ర్య‌టించాల‌ని ప్ర‌య‌త్నించాన‌ని.. అయితే.. అప్ప‌ట్లో త‌న‌ను రాకుండా అడ్డుకున్నార‌ని, అంటే మాచ‌ర్ల‌లో ఏమేర‌కు ప్ర‌జాస్వామ్యం ఉందో అర్ధ‌మ‌వుతుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి ప్ర‌జ‌లు అరాచ‌క శ‌క్తుల‌కు గ‌ట్టి బుద్ధి చెప్పార‌ని, దీంతో ఇప్పుడు ప్ర‌జాస్వామ్యం విర‌జిల్లుతోంద‌ని.. ఎవ‌రైనా స్వేచ్ఛంగా ఇక్క‌డ తిరిగే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అన్నారు.

ఇదేస‌మ‌యంలో తాను ఇలాంటి ముఠా రాజ‌కీయాల‌ను చూస్తూ ఊరుకునేది లేద‌ని సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఇలాంటి వారిని ఎలా అణిచేయాలో త‌న‌కు తెలుసున‌ని అన్నారు. ఇలాంటి రాజ‌కీయ వ‌ద‌రుబోతుల‌ను దారిలోకి తెచ్చేందుకు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని తేల్చి చెప్పారు. ఒక‌ప్పుడు రాయ‌ల‌సీమ‌ను ఫ్యాక్ష‌న్‌నుంచి ఎలా బ‌య‌ట ప‌డేశానో.. నాటి అధికారుల‌కు, ప్ర‌జ‌ల‌కు కూడా తెలుసున‌న్న చంద్ర‌బాబు ఇప్పుడు మాచ‌ర్ల‌ను కూడా అలానే బ‌య‌ట ప‌డేస్తున్నామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు స్వేచ్ఛ ఉంటుంద‌ని.. దానిని భ‌గ్నం చేస్తే.. ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోద‌ని.. తాట‌తీస్తామ‌ని హెచ్చ‌రించారు. “మీ రాజ‌కీయాలు మీరు చేసుకోండి. కానీ, ప్ర‌జ‌ల జోలికి వ‌స్తే మాత్రం తాట తీసి చూపిస్తాం” అని వార్నింగ్ ఇచ్చారు.

సూప‌ర్ సిక్స్‌పై..

గ‌త 15 మాసాల్లో సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశామ‌ని.. ప్ర‌జ‌లే ఈ ప‌థ‌కాలు సూప‌ర్ హిట్ కొట్టాయ‌ని అంటున్నార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. గ‌త ప్ర‌భుత్వం అప్పులు చేసి వెళ్లిపోయినా.. తాము త‌ట్టుకుని ముందుకుసాగుతున్నామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఏ ఇబ్బంది వ‌చ్చినా ముందుంటున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. కానీ, ఇంత చేస్తున్నా.. త‌మ‌పై విష ప్ర‌చారం చేస్తున్నార‌ని వైసీపీ నాయ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “ఉచిత బ‌స్సును వారు క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. కానీ,మేం ఇచ్చాం. ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉన్నా.. అంద‌రికీ త‌ల్లికి వందనం కింద సొమ్ము ఇచ్చాం. ఇది కూడా వారు ఊహించ‌లేదు. మైండ్ బ్లాంక్ అయ్యేలా మేం సుప‌రిపాల‌న అందిస్తున్నాం.” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

This post was last modified on September 21, 2025 8:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

56 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago