జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చేందుకు ముహూర్తం పెట్టారు. వాస్తవానికి ఈ ఏడాది జూలైలోనే ఆయన జనంలోకి వస్తానని గతంలోనే చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని.. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడాకార్యక్రమాలు చేపడతామని అన్నారు. అయితే.. వివిధ కారణాలతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. తాజాగా పార్టీ వైపు నుంచి ప్రజల నుంచి కూడా ప్రజర్ పెరుగుతున్ననేపథ్యంలో జనసేన ముహూర్తం పెట్టింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం దసరా తర్వాత.. అంటే అక్టోబరు తొలి వారంలో జనంలోకి జనసేన రానుంది.
ఏం చేస్తారు?
ప్రభుత్వ పరంగా జనసేన చేపట్టిన కార్యక్రమాలకు ప్రచారం తక్కువగా ఉందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడుతున్నారు. కొన్నాళ్ల కిందట విశాఖలో నిర్వహించిన `సేనతో సేనాని` కార్యక్రమంలోనూ ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని.. కానీ, మనం ప్రచారం చేసుకోలేక పోతున్నామని.. ఫలితంగా రావాల్సిన గ్రాఫ్ రావడం లేదని కూడా పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని నాయకులకు కూడా చెప్పారు. ఈ క్రమంలో నాయకులు ప్రజల మధ్యకు వెళ్లాలని కూడా అప్పట్లోనే సూచించారు. అయితే.. ఇప్పటి వరకు నాయకులు కదలడం లేదు.
మరోవైపు.. గ్రామీణ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ వాటిని పర్యవేక్షిస్తున్నా.. అనుకున్న స్థాయిలో జనసేనకు మైలేజీ పెరగడం లేదు. ఇదేసమయంలో గిరిజన ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇది కూడా ఆశించిన మేరకు ఫలాలు అందించడం లేదు. దీంతో నేరుగా ప్రజల మధ్యకు వెళ్లాలనేది, అభివృద్ధి పనులపై ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. ఇదేసమయంలో ప్లాస్టిక్ రహిత సమాజంపై ప్రచారం చేయనున్నారు. అలానే.. కోటి మొక్కల పెంపకం వంటి కీలక కార్యక్రమానికి కూడా దసరా తర్వాత శ్రీకారం చుట్టనున్నారు.
అలానే… క్షేత్రస్థాయిలో జనసేనను పుంజుకునేలా చేయనున్నారు. తాను కదిలితే తప్ప.. పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని గ్రహించిన పవన్ కల్యాణ్ ఆదిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు.. వచ్చే జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. గత ఎన్నికల్లోనే జనసేన నేరుగా బరిలో దిగకపోయినా.. చాలా చోట్ల అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఈ దఫా అధికారంలో ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా అడగులు వేస్తున్నారు. ఏదేమైనా దసరా తర్వాత.. జనసేన పుంజుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారు.
This post was last modified on September 21, 2025 8:11 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…