అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుని వచ్చే భక్తులు తమ శక్తి కొలది స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. దీనిలో కీలకమైంది ఆర్థిక మొక్కు. ఎంత కటికపేద వాడైనా శ్రీవారిని దర్శించుకున్నాక పరకామణి (శ్రీవారికి నగదు కానుకలు ఇచ్చే చోటు)ని చూడకుండా, దానిలో కనీసం రూపాయి అయినా వేయకుండా కొండ దిగడు. ఇక శ్రీమంతుల సంగతే చెప్పనక్కర్లేదు. కోట్లకు కోట్ల కానుకలు శ్రీవారికి సమర్పించుకుంటారు. అయితే తాజాగా ఈ పరకామణి వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
ఏం జరిగింది?
2023లో తిరుమల శ్రీవారి పరకామణి సొమ్మును లెక్కించే సమయంలో పరకామణి విభాగానికి ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న ఓ అధికారి సొమ్మును కాజేశారు. ఇది సీసీ టీవీ ఫుటేజీలోనూ బయటపడింది. అప్పట్లోనే ఇది పెద్ద వివాదంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై జోక్యం చేసుకున్న అప్పటి టీటీడీ చైర్మన్, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కేసు పెట్టారు. సదరు అధికారిని సస్పెండ్ కూడా చేశారు. ఆయన నుంచి విజిలెన్స్ అధికారులు కొంత సొమ్మును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసును అప్పట్లో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు.
దీనిపై తాజాగా బీజేపీ నాయకుడు, బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి వెలుగులోకి తీసుకువచ్చారు. నాడు జరిగిన దొంగతనం కేసుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ కేసును తిరిగి తెరవాలని సీఎం చంద్రబాబుకు వినతిపెట్టనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ నాయకులపైనా, వైసీపీ అధినేత జగన్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వామివారి సొత్తు రూ.100 కోట్లను దోచేశారని అన్నారు. దీనిలో కోట్ల సొమ్ము పరకామణి నుంచే దారిమళ్లిందని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేయించాలనే కోరనున్నట్టు తెలిపారు.
అంతేకాదు వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరిగిందని, దర్శన టికెట్లు దొడ్డిదారిలో అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారని, అన్నప్రసాదాలను నాశిరకం చేసి భక్తుల కడుపు మాడ్చారని, శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులను దారి మళ్లించారని, దీనిలో అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సహా జగన్‌కూ వాటాలు అందాయని నారా లోకేష్ ఆరోపించారు. ఈ మొత్తం విలువ రూ.100 కోట్లపైమాటేనని చెప్పారు. గతంలో సీఎం చంద్రబాబు పదే పదే శ్రీవారి జోలికి వెళ్లొద్దని చెప్పినా వైసీపీ నాయకులు వినిపించుకోలేదని, దీంతో గత ఎన్నికల్లో మట్టి కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on September 20, 2025 10:11 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…