టిడిపి బలంగా ఉన్నచోట, గత ఎన్నికల్లో జూనియర్లకు అవకాశం కల్పించారు. కొత్త తరం నాయకులకు అవకాశం ఇచ్చారని చెబుతున్న సీఎం చంద్రబాబు, యువ రక్తానికి అవకాశం ఇచ్చారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో కొత్త తరం నాయకులు, వారసులు తెరమీదకు వచ్చి పోటీ చేసి విజయం సాధించారు.
అయితే, ఈ స్థానాల్లో ఉన్న సీనియర్లకు, జూనియర్ల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఆధిపత్య ధోరణితోపాటు అధికారం విషయంలో కూడా ఇరుపాక్షాల మధ్య చికాకులు, గొడవలు తెర మీదకు వస్తున్నాయి.
ఈ నేపధ్యంలో అసలు విషయం ఏమిటి? ఎందుకు గొడవ పడుతున్నారు? పార్టీ తరఫున ఇటీవల సమాచారం రాబట్టారు. సాధారణంగా ఆదాయాలకు, పనులకు సంబంధించి వివాదాలు జరుగుతుంటాయి. అయితే, దీనికి మించి వచ్చే ఎన్నికల్లో జూనియర్లకే అవకాశం ఇస్తే, సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్నది సీనియర్ నాయకుల ఆవేదన ప్రధాన విషయం.
వీరు దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో పనిచేసి ప్రజలను కలుసుకుని పార్టీని డెవలప్ చేశారు. చాలా మంది తమ ఖర్చుతో కూడా పార్టీ అభివృద్ధికి సహకరించారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం లేకపోతే ఏం జరుగుతుందో, భవిష్యత్తులో టికెట్ రాదా, తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్లపై సీనియర్ల విమర్శలు, అంతర్గత చర్చలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాయి. ఇటీవల నియోజకవర్గాల్లో కుల సమీకరణలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే మరియు సీనియర్ నాయకుడి కులం ఒకటే అయినప్పటికీ, ఆ కుల సంఘాల్లో విభజనలను సృష్టించి తమకు అనుకూలంగా మార్చుకునే నాయకులు పెరుగుతున్నారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల ప్రభావం తగ్గకుండా చూసుకోవడం, ప్రస్తుత ఎమ్మెల్యేకి చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.
ఈ వివాదాలు పెరుగుతున్నాయి. ఈ విషయం పార్టీ అగ్రనాయకులకు చేరింది. అయినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన కనిపించడం లేదు. సీనియర్లకు పదవులు ఇస్తామని హామీలు ఇచ్చి, గత ఎన్నికల్లో టికెట్లను కొత్తవారికి అప్పగించారు. ఇప్పటివరకు సీనియర్లకు న్యాయం చేయలేదు. అందువల్ల, వారు ఇప్పుడు న్యాయం కోరుతున్నారు. ఈ నేపధ్యంలో సీనియర్ల సమస్యలను సీఎం చంద్రబాబు పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది.
మరి, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on September 20, 2025 2:22 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…