2019లో దారుణ హత్యకు గురైన ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ బాబాయి.. వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించిన కేసు విచారణను సీబీఐ గతంలోనే ముగించింది. దీనికి సంబంధించి కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. అయితే.. వివేకాకుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత మాత్రం.. ఈ కేసు విచారణను పునః ప్రారంభించాలని.. తమకు అనేక అనుమానాలు ఉన్న వ్యక్తులను అసలు విచారించలేదని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. తాజాగా మంగళవారం దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు(తెలంగాణ హైకోర్టు) కు వెళ్లాలని.. అక్కడే పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
మరోవైపు.. సీబీఐ కూడా కోర్టు ఆదేశిస్తే.. తాము మరోసారి విచారించేందుకు సిద్ధంగానే ఉన్నామని సీబీఐ కూడా కోర్టుకు వివరించింది. దీంతో సునీత కు సుప్రీంకోర్టు మరో చాన్స్ ఇస్తూ.. తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని.. కేసును మళ్లీ విచారించేలా కోరాలని సూచించింది. అంతేకాదు.. తెలంగాణ హైకోర్టును కూడా ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత.. ఇరు పక్షాల వాదనలు విని.. 8 వారాల్లోనే తీర్పు వెలువరించాలని పేర్కొంది. అంటే.. దాదాపు వివేకా కేసును మళ్లీ విచారించేందుకు వీలుగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందనే విషయం అర్ధమవుతోంది.
ఎవరు లక్ష్యం?
ఇక, వివేకా కుమార్తె విషయానికి వస్తే.. డాక్టర్ సునీత.. తన తండ్రి మరణానికి సంబంధించిన నిందితులను కోర్టుకు లాగి.. శిక్ష పడేలా చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఈక్రమంలో అనేక అవమానాలు, ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అధికారంలో ఉన్న అన్న(జగన్) నాడు సహకరించకపోయినా.. ఆమె పంటిబిగువున పోరాటం కొనసాగిస్తున్నారు. కన్న తండ్రిని చంపిన నేరస్తులు నిర్భయంగా తిరుగుతుంటే.. తాము ప్రాణ భయంతో.. ఆవేదనతో రోడ్ల వెంబడి తిరుగుతున్నామని కొన్నాళ్ల కిందట ఆమె చేసిన వ్యాఖ్యలు గూడుకట్టుకున్న ఆమెలోని ఆవేదనను పట్టి చూపిస్తాయి. ఇక, ఈ కేసులో ప్రధానంగా సునీత కోరుతున్నది.. ఇవీ..
+ గొడ్డలి పోటును గుండెపోటుగా పేర్కొన్నది ఎవరు?
+ తొలి ఫోన్ జగన్‌కు ఎందుకు వెళ్లింది?
+ ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి?
+ రక్తపు మరకలను ఎందుకు అంత హడావుడిగా తుడిచేశారు? దీనివెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి?
+ తాము రాకుండానే వివేకా భౌతిక కాయానికి అంతిమ సంస్కారం చేయాలని ఎందుకు భావించారు?
+ నిందితుల ఫోన్ కాల్ డేటాను వెలుగులోకి తేవాలి..
+ ఈ కేసులో చేతులు మారిన సొమ్ము విషయం ఏంటి?
This post was last modified on September 16, 2025 9:12 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…