Political News

యూరియా కోసం క్యూలైన్‌లో మాజీ మంత్రి!

తెలంగాణ‌లో యూరియా కోసం రైతులు నానా తిప్ప‌లు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. కేంద్రం నుంచి నిల్వ‌లు వ‌చ్చాయ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా.. స్థానికంగా అవ‌స‌ర‌మైన రైతులకు మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో అన్న‌దాత‌లు నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు. శనివారం క‌రీంన‌గ‌ర్‌లో పోలీసు స్టేష‌న్ అడ్డాగా.. రైతుల‌ను క్యూలో నిల‌బెట్టి.. యూరియా కోసం టోకెన్ల‌ను పంపిణీ చేశారు. ఇది తీవ్ర వివాదంగా మారింది. దీనిపై రైతులు, సంఘాల నాయకులు కూడా ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే.. స‌ర్కారు మాత్రం రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతోంది.

తాజాగా రైతుల ప‌రిస్థితి క్షేత్ర‌స్థాయిలో ఎలా ఉందో చెప్పేందుకు బీఆర్ఎస్ నాయ‌కురాలు, మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఆమె కూడా మ‌హిళా రైతే కావ‌డం గ‌మ‌నార్మం. ఆమెకు 10 ఎక‌రాల‌కుపైగా పొలం ఉంది. దీనిలో వ‌రి స‌హా.. ఇత‌ర పంట‌లు పండిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స్వ‌యంగా ఆమె యూరియా కోసం ప్ర‌భుత్వ దుకాణాల వ‌ద్ద‌కు వ‌చ్చారు. కానీ, భారీ ఎత్తున క్యూలైన్లు క‌నిపించాయి. అర‌కిలో మీట‌రుకు పైగా రైతులు క్యూక‌ట్టారు. కానీ.. ఇంత సేపు నిల‌బ‌డ్డా.. యూరియా బ‌స్తా ల‌భిస్తుందా? అంటే.. ప్ర‌శ్నార్థ‌క‌మే.

అయిన‌ప్ప‌టికీ.. యూరియా బస్తాల కోసం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూలైన్‌లో నిలుచున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం, గుండాత మడుగు సహకారం సంఘం వద్ద రైతులు క్యూలైన్‌లో నిల‌బ‌డ్డారు. ఈ లైను సుమారు అర‌కిలో మీట‌రుపైగానే ఉంది. అయిన‌ప్ప‌టికీ.. రాథోడ్ ఆలైన్‌లోనే నిల‌బ‌డ్డారు. తనకు ఐదెకరాల సాగుభూమి ఉంద‌ని ఆమె తెలిపారు. దీనికి సంబంధించి యూరియా కోసం.. వ‌చ్చిన‌ట్టు తెలిపారు. కానీ, భారీ ఎత్తున క్యూలైన్లు ఉన్నాయ‌ని.. క‌నీసం రైతుల కోసం తాగునీటిని కూడా ఏర్పాటు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. ఇక‌, త‌న‌కున్న‌ పట్టా పాస్‌ పుస్తకంతో క్యూలైన్‌లో నిలబ‌డ్డ మాజీ మంత్రి.. మిగతా రైతులతో పాటు కూపన్లు రాయించుకు న్నారు.

ఈ సందర్భంగా రైతులతో స‌త్య‌వ‌తి రాథోడ్‌ మాట్లాడారు. యూరియా కోసం రైతులు వారాల తరబడి పడిగాపులు కాస్తున్నట్టు కొంద‌రు అన్న‌దాత‌లు త‌మ స‌మ‌స్య‌లు మాజీ మంత్రికి చెప్పుకొన్నారు. ఒక‌రిద్ద‌రు అయితే.. ఇంటికి కూడా పోకుండా.. అక్క‌డే ఉంటున్నామ‌న్నారు. ఇక‌, ఒక్క బస్తా కూడా అందడం లేదని మ‌రో ఇద్ద‌రు రైతులు చెప్పారు. దీనిపై సత్యవతి రాథోడ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రభుత్వం కుంటిసాకులతో తప్పించుకోకుండా రైతులకు యూరియా అందించాలన్నారు. “ప‌రిస్థితి ఎలా ఉందో చూడండి. సీఎం, వ్య‌వ‌సాయ మంత్రి వ‌చ్చి ఈ లైన్‌లో నిల‌బ‌డితే రైతుల బాధ వారికి తెలుస్తుంది” అని దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on September 15, 2025 11:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

46 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago