Political News

రేవంత్‌కు మరక: ఫస్ట్ టైమ్ ఏం జరిగిందంటే!

తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. ఇది విపక్షాలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చేలా మారింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. యూరియా దొరకక ఇప్పటివరకు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యా యత్నాలు చేశారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, యూరియా సమృద్ధిగానే ఉందని, కేంద్రం సరఫరా చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.

ఏ జిల్లాలో చూసినా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్ద క్యూలో నిలబడి వేచి ఉంటున్నారు. అన్నం, నీరు కూడా మరిచి యూరియా కోసం నిలబడుతున్న పరిస్థితి. ఎక్కడ విక్రయ కేంద్రం ఉన్నా అక్కడ రైతులు గుంపులుగా క్యూకడుతున్నారు. ఈ పరిణామాల వల్ల ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో చోటుచేసుకున్న రెండు ఘటనలు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు రప్పించాయి.

ఏం జరిగింది?

బీబీ మండలంలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రానికి వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఈ సమయంలో తోపులాట జరిగి, ఒక రైతు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆయనకు ఫిట్స్ వచ్చినట్టు గుర్తించిన ఇతర రైతులు సమీప ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతుల ప్రాణాలతో రేవంత్ ప్రభుత్వం ఆడుకుంటోందని దుయ్యబట్టాయి.

ఇక రైతులు కూడా తమ ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, బీబీ మండలానికి పోటెత్తిన రైతులను కట్టడి చేయలేకపోయిన అధికారులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విక్రయ కేంద్రానికి తాళాలు వేసి మూసేశారు.

స్టేషన్‌లో రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే వేలాది మంది రైతులు ఉన్నా కేవలం 938 యూరియా బస్తాలకే టోకెన్లు ఇచ్చారు. ఒక దశలో పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. దీంతో రైతులు తిరగబడ్డారు.

ఈ వ్యవహారం మరింతగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విమర్శలు తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో తొలిసారిగా యూరియా కోసం అన్నదాతను పోలీస్ స్టేషన్ గడప తొక్కించారని, లాఠీచార్జ్ చేయించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. రైతులు కూడా దీనిని తీవ్రంగా భావిస్తున్నారు.

“మా కష్టాలు తాత్కాలికం. రేపు మాకు కూడా అవకాశం వస్తుంది” అని రైతులు వ్యాఖ్యానించారు.

This post was last modified on September 14, 2025 1:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

1 hour ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

2 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

3 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

4 hours ago