ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన వేగం పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. “ఇప్పటికి 15 మాసాలు గడిచాయి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం. అనేక అభివృద్ధి పనులు చేశాం. కేంద్రంతో సంబంధాలు మరింత బలోపేతం చేశాం. పెట్టుబడులు తెస్తున్నాం. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు. కానీ, ఇక, నుంచి స్పీడ్ పెంచుతున్నాం. ఇకపై `జెట్ స్పీడ్`తో నేను ముందుకు పోతా.. నాతో కలిసి ప్రయాణించండి. లేకపోతే..వెనుకబడిపోతారు. అదే జరిగితే.. భవిష్యత్తులో మీరుఎక్కడ ఉంటారో ఊహించుకోండి.“ అని మంత్రులు, ఉన్నతాధికారులను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తాజాగా రాష్ట్రంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1) 12 మంది కలెక్టర్లను బదిలీ చేశారు. వీరిలో నలుగురు కొత్త వారికి అవకాశం కల్పించారు. అదేవిధంగా తాజాగా శనివారం 14 జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు. వీరిలో ఏడుగురు కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇదేసమయంలో తీవ్ర వివాదాలు ఎదుర్కొన్న.. రాజకీయ వివాదాలను పరిష్కరించలేక పోయిన.. మరో ఆరుగురు ఎస్పీలను పక్కన పెట్టారు. వీరిలో నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, నెల్లూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల ఎస్పీలు ఉన్నారు. వీరికి ఎక్కడా పోస్టింగు ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు పాలనపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. “ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి జెట్ స్పీడే. మీ అంతట మీరే పుంజుకోవాలి. ఇక్కడ స్పూన్ ఫీడింగ్ ఉండదు.“ అని చెప్పారు. అంతేకాదు.. పెట్టుబడులు వస్తున్నాయని.. వచ్చే రెండు మూడు మాసాల్లో పనులు కూడా పుంజుకుంటాయని తెలిపారు. అప్పటికి కూడా వేగం పుంజుకోక పోతే.. ప్రజలు అన్నీగమనిస్తున్నారని.. వ్యాఖ్యానించారు. నిరంతరం ప్రజలకు చేరువ కావాలని మంత్రులను ఆదేశించారు.
సంక్షేమ పథకాలను సక్రమంగా అందించాలని, అభివృద్ధిని కూడా చేయాలని కలెక్టర్లను, శాంతి భద్రతలను మరో లెవిల్‌కు తీసుకువెళ్లాలని ఎస్పీలను ఆయన ఆదేశించారు. ఈ విషయంలో వెనుకబడితే.. ఉపేక్షించేది లేదన్నారు. ఒకవేళ కాదు.. కూడదంటే.. మీరు అక్కడే ఉండిపోతారని వ్యాఖ్యానించారు. అనేక సమస్యలు ఉన్నా.. సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని.. అనేక పెట్టుబడులు కూడా తీసుకువస్తున్నామని చెప్పారు. ఇలాంటి సమయంలో మరింత వేగంతో మరింత పారదర్శకతతో పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
This post was last modified on September 13, 2025 11:00 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…