ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిత్యం గోలనే. ఓ వైపు మునిసిపల్ చైర్మన్, అధికార పార్టీకి చెందిన సీనియర్ మోస్ట్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, మరోవైపు తాడిపత్రి తాజా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య నిత్యం రాజకీయ మంటలు రేగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలోని తన ఇంటికి తనను ఎందుకు అనుమతించరు అంటూ లోకల్ నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లిన కేతిరెడ్డి ఎట్టకేలకు తాడిపత్రిలో కాలుపెట్టారు. అయితే ఏ క్షణమైనా ఆయన తిరిగి తనకు తానుగా తాడిపత్రిని విడిచిపెట్టి వెళ్లక తప్పేలా లేదు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కేతిరెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు మునిసినల్ శాఖ సర్వం సిద్ధం చేసినట్టు సమాచారం.
2019 నుంచి 2024 వరకు తాడిపత్రి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దిరెడ్డి కొనసాగారు. ఈ సమయంలో ఆయన తాడిపత్రిలో అధునాతన హంగులతో ఓ ఇల్లు నిర్మించుకున్నారు. ఈ ఇంటి కోసం ఆయన మునిసిపాలిటి పరిధిలోని ప్లాట్ నెంబర్లు 2, 16 లలోని 10 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన పార్టీనే అధికారంలో ఉంది కదా. ఇదే అదనుగా చేసుకున్న కేతిరెడ్డి తన 10 సెంట్లకు ఆనుకున్న మరో 2 సెంట్ల భూమిని ఆక్రమించి ఇంటిని నిర్మించారు. అంతేకాదండోయ్… అదికారంలో తానెంటీ అనుమతులు తీసుకునేది అంటూ ఆయన ఏకంగా మునిసిపాలిటి అనుమతి లేకుండానే ఇల్లు కట్టి పారేశారు.
ఇప్సటికే ఓ దఫా మునిసిపల్ శాఖ అధికారులు ఓ సారి సర్వే చేయగా…2 సెంట్ల ఆక్రమణ వెలుగులోకి వచ్చింది. తాజాగా శుక్రవారం పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చిన సందర్భంగా మునిసిపాలిటి అధికారులు మరోమారు సర్వే చేశారు. భూ ఆక్రమణపై స్పష్టమైన నిర్ధారణ వచ్చేసింది. ఈ సర్వేకు టౌన్ ప్లానింగ్ అదికారి సుజాత కూడా హాజరయ్యారు. సర్వే పూర్తి అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె ఓ బాంబులాంటి వార్త పేల్చారు. తన ఇంటి నిర్మాణం కోసం కేతిరెడ్డి అసలు అనుమతే తీసుకోలేదని ఆమె కీలక అంశాన్ని బయటపెట్టారు. ఈ మాట విన్నంతనే వైసీపీ శ్రేణులంతా షాక్ తిన్నాయి.
పెద్దారెడ్డి ఇంటి నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఓ నివేదిక పంపనున్నట్లు సుజాత చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. ఈ లెక్కన ఇది చిన్న విషయం కాదని చెప్పిన అధికారి… ఇది ఇల్లు కూల్చివేత దాకా వెళ్లడం ఖాయమన్న వాదనలకు బలం చేకూరుస్తున్నారు. భూఆక్రమణే అయితే అక్కడిదాకే ఇల్లు కొట్టేస్తారు. మిగిలినదానిని అలా వదిలేసి వెళతారు. అనుమతి లేకుంటే కూల్చివేతే కదా. ఇదే జరిగితే… ఇక పెద్దారెడ్డి గోల ఉండదు. పోలీసులకు అనవసరమైన బందోబస్తు డ్యూటీలు ఉండవని చెప్పక తప్పదు.
This post was last modified on September 13, 2025 7:02 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…