Political News

ఎవరెళ్లినా కనిపించేది మొండిగోడలేగా!

ఏపీలో గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటు పరంపై పెద్ద రచ్చే నడుస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను కేంద్రం నుంచి సాధించామని వైసీపీ చెబుతుంటే, వాటిని తామేమీ ప్రైవేటు వ్యక్తులకు తెగనమ్మడం లేదని, పీపీపీ పద్ధతిలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నామని కూటమి పార్టీలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో గడచిన మూడు రోజులుగా అటు కూటమి పార్టీల నేతలు, ఇటు వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల నిర్మాణాలను పరిశీలిస్తూ సాగుతున్నారు. అయితే ఒకటి, అరా తప్పించి అన్ని చోట్ల ఆయా కాలేజీల నిర్మాణం మొండిగోడల వద్దే నిలిచిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

వైసీపీ జమానాలో కేంద్రం ఏపీకి మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల్లో జగన్ తన సొంతూరు పులివెందులలో కాలేజీ నిర్మాణం పూర్తి చేశారు. అదే మాదిరిగా మచిలీపట్నం, నంద్యాల, ఇటీవలే పాడేరు మెడికల్ కాలేజీలు మాత్రమే పూర్తి అయ్యాయి. మిగిలిన కాలేజీలన్నీ దాదాపు పునాదులు, మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి.

ఈ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్న కూటమి పార్టీల నేతలు జగన్ కట్టించిన కాలేజీల స్థితి ఇది అంటూ సెటైర్ల మీద సెటైర్లు సంధిస్తున్నారు. ఈ ఫోటోలు చూసిన జనం కూడా వైసీపీ నేతల వాదనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, శుక్రవారం వైసీపీ కీలక నేతలు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ తమ అనుచరులతో కలిసి నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించారు. ఇక్కడ కూడా కొన్ని ఫ్లోర్ల మేర శ్లాబ్ అయితే వేశారు గానీ, ఇంకా మొండిగోడలే దర్శనమిస్తున్నాయి.

ఇదే వీడియోను వైసీపీ యాక్టివిస్టులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టారు. ఈ వీడియోను చూసిన వారు ఇది కూడ మొండిగోడలతోనే ఉంది కదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వెరసి, కట్టని కాలేజీల నిర్మాణం పూర్తి అయ్యిందని చెబితే ఇలాగే అభాసుపాలు అవుతారని చెప్పక తప్పదు.

This post was last modified on September 12, 2025 10:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

14 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago