ఏపీ సీఎం చంద్రబాబు యువతకు పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇటు పార్టీలోను.. అటు ప్రభుత్వంలోనూ కూడా.. ఆయన యువ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మంత్రులను చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా కూడా అవకాశం ఇచ్చారు. అయితే.. ఇది రాజకీయ కోణం. ఇక, పాలనా యంత్రాంగం పరంగా కూడా.. చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూల్స్‌ను కొంత మేరకు పక్కన పెట్టిన చంద్రబాబు ట్రైనీ అధికారులుగా ఉన్న ఐఏఎస్‌లకు కలెక్టర్లుగా జిల్లాల బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.
తాజాగా 12 మంది కలెక్టర్లను బదిలీ చేయడంతోపాటు.. మరో నలుగురు కొత్తవారికి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వీరిలో నిషాంత్ కుమార్, డాక్టర్ సిరి, ప్రభాకర్ రెడ్డి, రాజా బాబు ఉన్నారు. వాస్తవానికి వీరు ట్రైనీ కలెక్టర్లుగా ఉన్నారు. అనంతరం.. వీరిని డిప్యూటీ కలెక్టర్లుగా నియమించాలి. ఆ తర్వాత.. సంయుక్త కలెక్టర్లుగా పదోన్నతి కల్పించిన తర్వాత.. మరో ఐదారేళ్లకు కానీ.. వారిని పూర్తిస్థాయిలో కలెక్టర్లుగా నియమించే అవకాశం లేదు. కానీ, మొత్తం 15 మంది శిక్షణలో ఉన్న ఐఏఎస్ లు ఉండగా.. పైనలుగురికి మాత్రం నేరుగా కలెక్టర్లుగా అవకాశం కల్పించారు.
రీజనేంటి?
ప్రస్తుతం శిక్షణలో ఉన్న కలెక్టర్లకు ఇటీవల సీఎం చంద్రబాబు ఆర్టీజీఎస్ సహా.. ఐవీఆర్ ఎస్ వంటి సేవలను అప్పగించారు. వీటిలో ప్రతిభ చూపిన వారిని.. అదేవిధంగా గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమైన వారిని ప్రత్యేకంగా గుర్తించారు. వీరిలో నిషాంత్ కుమార్, డాక్టర్ సిరి, ప్రభాకర్ రెడ్డి, రాజా బాబు చంద్రబాబు మార్కుకు తగిన విధంగా సక్సెస్ అయ్యారు. దీంతో వారిని నేరుగా కలెక్టర్లుగా జిల్లాలకు పంపించారు. అయితే.. దీనికి కేంద్ర ప్రభుత్వ రూల్స్ ఒప్పుకొంటాయా? అంటే.. ఉత్తమ ప్రతిభ చూపినట్టు సర్కారు ఆమోదం తెలిపి.. కేంద్రానికి పంపితే.. సాధ్యమే. తాజాగా చంద్రబాబు అదే చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
దిశానిర్దేశం..
చంద్రబాబు కొత్త కలెక్టర్లను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. సీఎం అంటేనే కామన్ మ్యాన్(సాధారణ పౌరుడు)గా భావిస్తున్న ప్రభుత్వమని.. కాబట్టి కలెక్టర్లు కూడా.. అదేవిధంగా ప్రజలకు చేరువ కావాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారంతో కాకుండా.. సేవా దృక్ఫథంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఒక్కొక్కసారి రూల్స్ అడ్డం వచ్చినా.. పేదల స్థితి గతులు, అర్హులు.. పరిస్థితులను అధ్యయనం చేసుకుని వాటికి అనుగుణంగా ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు.
This post was last modified on September 12, 2025 9:02 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…