అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్-సూపర్ సిక్స్ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసకర పాలన మొదలుబెట్టారని, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టివేసిందనిఅన్నారు. అవినీతి, అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలను తరిమేశారని, రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లేలా ఇబ్బందిపెట్టారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం 93 పథకాలను నిలిపివేసిందని, అందుకే, పేద, మధ్యతరగతి జీవితాలలో మార్పు తెచ్చేందుకు సూపర్ సిక్స్ హామీ ఇచ్చామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని తెలిపారు. 2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయని గుర్తు చేశారు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు కూటమికి ఇచ్చి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని ప్రజలను ప్రశంసించారు.
ఈ సభ రాజకీయాల కోసం, ఓట్ల కోసం కాదని.. ఇచ్చిన మాట నిలబెట్టున్నామని చెప్పేందుకే ఈ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. సూపర్ సిక్స్ ను అవహేళన చేశారని, పింఛన్ల పెంపు అసాధ్యమని తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని , మెగా డీఎస్సీ సాధ్యం కాదని విష ప్రచారం చేశారని, దీపం వెలగదు… ఫ్రీ బస్సు కదలదు అని వైసీపీ నేతలు ప్రచారం చేశారని చెప్పారు. అయితే, కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని, అందుకే సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభ ఏర్పాటు చేశామని చెప్పారు.
15 నెలల పాలనలో సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు అనంతపురానికి వచ్చామని, తమ ప్రభుత్వానికి అండగా నిలిచిన అన్నదాతకు, స్త్రీ శక్తులకు, యువకిషోరాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, నేపాల్ లో ఆందోళనలు జరుగుతున్నాయని, అక్కడ మన తెలుగువాళ్లు 200 మంది చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు తెచ్చేందుకు మంత్రి లోకేశ్‌కు బాధ్యతలు అప్పగించామని చెప్పారు.
This post was last modified on September 10, 2025 6:05 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…