ఆట్రో డ్రైవ‌ర్ల‌కు బాబు అభ‌యం.. కీల‌క ప‌థ‌కం ప్ర‌క‌ట‌న‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రంలోని ఆటో వాలాల‌కు అభ‌యం ప్ర‌సాదించారు. కూట‌మి ప్ర‌భుత్వం అమ లు చేస్తున్న సూప‌ర్ 6 హామీల్లో ఒక‌టైన ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం కార‌ణంగా.. ఒకింత ఉపా ధి కోల్పోయి.. ఇబ్బందులు ప‌డుతున్న ఆటో డ్రైవ‌ర్ల‌ను ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. తాజాగా అనంత పురంలో జ‌రిగిన ‘సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్‌’ భారీ బ‌హిరంగ స‌భా వేదిక‌పై నుంచే చంద్ర‌బాబు ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఆటో డ్రైవ‌ర్ల క‌ష్టాలు త‌న‌కు కూడాతెలుసున‌ని.. ఈ నేప‌థ్యంలో వారిని త‌ప్ప‌కుండా ఆదుకుంటా మన్నారు.

ఈ ఏడాది ద‌స‌రా నుంచి ఏటా రూ.15 వేల చొప్పున ఇచ్చి ఆటోలు న‌డిపి.. కుటుంబాల‌ను పోషించుకునే ప్ర‌తి ఒక్క డ్రైవ‌ర్‌ను ఆదుకుంటామ‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. త‌ద్వారా వారికి ఎదుర‌వుతున్న ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కిస్తామ‌న్నారు. అయితే.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎంత మంది ఆటోడ్రైవ‌ర్లు ఉన్నార‌నే విష‌యంపై త్వ‌ర‌లోనే ఆర్టీఏ కార్యాల‌యాల నుంచి వివ‌రాలు సేక‌రించి అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. దీంతో ఆర్టీసీలో ఉచిత ప్ర‌యాణం కార‌ణంగా.. ఆటో డ్రైవ‌ర్లు ప‌డుతున్న ఇబ్బందుల‌కు చెక్ పెట్టిన‌ట్టు అయింది.

మ‌రోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న మాట వాస్త‌వ‌మే. గ‌తంలోనే ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ప్ర‌క‌టించిన‌ప్పుడు.. వారు సీఎం చంద్ర‌బాబును క‌లుసుకున్నారు. త‌మ ఉపాధికి దెబ్బ ప‌డుతుంద‌ని.. త‌మ‌ను కూడా ఆదుకోవాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సీఎం చంద్ర‌బాబు వారిని కూడా ఆదుకునేందుకు వీలుగా కీల‌క ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. దీంతో ఆటో డ్రైవ‌ర్లకు క‌ష్టాలు తొల‌గి పోనున్నాయి. పైగా ఈ ఏడాది ద‌స‌రా నుంచే ఈ ప‌థ‌కాన్ని అమలు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం ద్వారా.. చంద్ర‌బాబు వారిని మ‌రింత ఊర‌డించిన‌ట్టు అయింది.