Political News

వైసీపీతో మిలాఖ‌త్‌.. ఇక‌, వారికి చుక్క‌లే.. !

రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోని నాయకులతో చేతులు కలిపి పనులు చేస్తున్నారన్నది ప్రధాన విమర్శ. ఇది గత ఏడు నెలలుగా వినిపిస్తున్నప్పటికీ.. ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వారికి చెక్ పెట్టేదిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం నుంచి చిన్నాచితక కాంట్రాక్టులు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిని వైసిపి లోని అనుకూల నాయకులతో కలిసి చేపడుతున్నారనేది ప్రభుత్వానికి అందిన సమాచారం.

అదేవిధంగా కూటమి నాయకులు చాలామంది వైసిపి నేతలతో కలిసి రాజకీయాలు చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇది సరైన విధానం కాదన్నది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ గత వైసిపి హయాంలో తమకు సహకరించారని చెబుతున్న ప్రస్తుత కూటమి నాయకులు.. వారితో కలిసి పనులు పంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసిపి నాయకులతో కలిసి అడుగులు వేస్తున్నారని విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీరిలో ఒకరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఉండటం మరింత విశేషం.

ఇలా చేయటం వల్ల వైసీపీని టార్గెట్ చేసే విషయంలో వెనుకబడి ఉండటం, అలాగే వైసిపి విధానాలను ఒకప్పుడు ఎండగట్టిన నాయకులే ఇప్పుడు వారితో కలిసి చేతులు కలుపుతుండటం వంటివి ప్రజల మధ్యకు చర్చగా మారాయి. ఇలాంటి వాటివల్ల సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని సీఎం చంద్రబాబు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఈ తరహా పనులు మానుకోవాలని ఆయన ఇప్పటికే రెండుసార్లు సూచించారు. ఇకపై ఇలాంటి వారికి నిధులు ఆపేసి, పనులు కూడా మంజూరు చేయకూడదు అన్నది నిర్ణయం గా ఉన్నట్టు సమాచారం.

సహజంగా ప్రత్యర్థులను టార్గెట్ చేయడం అనేది ప్రభుత్వంలో ఉన్న నాయకుల పనికి ఒక ఉదాహరణ. కానీ ప్రస్తుతం ఆ పని వదిలేసి ప్రత్యర్ధులతోనే కలిసి పని చేయటం అనేది ఆశ్చర్యంగా మారింది. ఉత్తరాంధ్రలోనూ వైసీపీలోని సీనియర్ నాయకులతో కొందరు ఎమ్మెల్యేలు మిలాఖ‌త్‌ అయ్యారు అన్నది విమర్శలకు దారితీస్తోంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని సమాచారం.

ఇటువంటి వాటిని తక్షణం వదిలేయాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు అన్నది చంద్రబాబు చెబుతున్న మాట. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వైసీపీ నాయకులతో చేతులు కలిపిన‌ కూటమి నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించకూడదన్నది చంద్రబాబు ఉద్దేశం గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుంది.. ఏం చేస్తారో అనేది చూడాలి.

This post was last modified on September 9, 2025 2:25 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

37 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago