Political News

ఆ ఇద్దరికి బుద్ధి చెప్పాల‌నే: కేటీఆర్ కామెంట్స్‌

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్ పార్టీ దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సీనియ‌ర్ నాయ‌కులు ప‌లువురు సోమ‌వారం భేటీ అయ్యారు. ఆయ‌న నిర్ణ‌యం మేర‌కు ఈ ఎన్నిక‌ల్లో ఓటుకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అనంత‌రం మాజీ మంత్రి, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

“ఆ రెండు పార్టీల‌కు బుద్ధి చెప్పాల‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌డం మంచిది కాద‌ని మాకు కూడా తెలుసు” అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

“అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ రెండు తెలంగాణ స‌మాజానికి, రాష్ట్రానికి కూడా ద్రోహం చేశాయి. ప్ర‌స్తుతం రైతుల‌ను రెండు పార్టీల ప్ర‌భుత్వాలు మోసం చేశాయి. అందుకే ఈ ఎన్నిక‌ల్లో రెండు పార్టీల‌కు త‌గిన గుణ‌పాఠం నేర్పాల‌నే ద‌రంగా ఉన్నాం” అని కేటీఆర్ చెప్పారు.

కాంగ్రెస్ త‌ర‌ఫున సుద‌ర్శ‌న్ రెడ్డి, బీజేపీ త‌ర‌ఫున రాధాకృష్ణ‌న్ బ‌రిలో ఉన్నార‌ని, అయితే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఈ రెండు పార్టీలు రాజీపడుతున్నాయ‌న్నారు. 78 ల‌క్ష‌ల మందికి పైగా రైతులు ఇప్పుడు అగ‌చాట్లు ప‌డుతున్నార‌ని, వారికి కనీసం ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం సాయం అందించ‌డం లేద‌న్నారు.

యూరియా స‌హా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న రైతాంగానికి సంఘీభావంగా ఉండేందుకే తాము ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు కేటీఆర్ తెలిపారు.

“ఒక‌వేళ నోటా ఉంటే దానికే తాము వేసేవారం. కానీ ప్ర‌స్తుతం ఎన్నిక‌ల తీరు బ్యాలెట్ విధానంలో నిర్వ‌హిస్తున్నారు. దీనిలో నోటా ఉండ‌దు. ఈ క్ర‌మంలో మేం ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్నాం. మాకు ఎవ‌రూ బాస్‌లు లేరు, ప్ర‌జ‌లే మాకు బాస్‌లు. అందుకే ప్ర‌జ‌ల కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్నాం” అని వివ‌రించారు.

సిగ్గుందా?

సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “సీఎంకు సిగ్గుందా?” అని ప్ర‌శ్నించారు. హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ త‌యారీ విష‌యంపై మ‌హారాష్ట్ర పోలీసులు నెల రోజులుగా ఇక్క‌డ కార్మికులుగా చేరి ఈ గుట్టును ఛేదించార‌ని, మరి రాష్ట్ర స‌ర్కారు ఏమైంద‌ని ఆయ‌న ప్రశ్నించారు.

“మీ ఈగ‌ల్ ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మ‌హారాష్ట్ర పోలీసులు వ‌చ్చి నెల రోజులు ఇక్క‌డ ఆప‌రేష‌న్ చేస్తే ప్ర‌భుత్వ యంత్రాంగం ఏమైంది? కనీసం మ‌హా పోలీసులు రాష్ట్రానికి స‌మాచారం ఇవ్వ‌లేదు” అని వ్యాఖ్యానించారు.

This post was last modified on September 8, 2025 10:37 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

34 minutes ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

3 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

5 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

6 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

6 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

7 hours ago