‘జగన్ అంటే జనం-జనం అంటే జగన్’ ఒకప్పుడు వైసీపీలో వినిపించిన నినాదం ఇది. అయితే.. రాను రాను ఈ నినాదం రూటు మారుతోంది. జనం కోసం వైసీపీ చేస్తున్న కార్యక్రమాలే తగ్గిపోగా.. ఇప్పుడు అరకొరగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా జగన్ లేకుండా పోతున్నారు. ఆయన తాపీగా తాడేపల్లిలోని ఆఫీసులో కూర్చొని కునుకు తీస్తుండగా.. ఇతర నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయా కార్యక్రమాలు మొక్కుబడి ఫొటో సెషన్లుగా మారుతున్నాయి. నాయకులు రావడం.. ఇలా ఫొటోలకు ఫోజులు ఇచ్చి.. వెళ్లిపోవడంతోనే కార్యక్రమాలు ముగిసిపోతున్నాయి.
తాజాగా ‘అన్నదాత పోరు’ పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 9న అంటే.. మంగళవారం.. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం ఉద్యమించాలని నిర్ణయించింది. రైతులు పడుతున్న ఇబ్బందులు, యూరియా కొరత, రైతుల కష్టాలను ప్రధానంగా తీసుకుని ఈ నిరసనకు రూపకల్పన చేశారు.అయితే.. దీనికికూడా జగన్ రావడం లేదని స్పష్టం చేశారు. “ఇది.. మనందరం కలిసి సక్సెస్ చేయాల్సిన కార్యక్రమం. జగన్ వేరే సమయంలో వేరే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది మనకు మనం నిర్ణయించుకున్న కార్యక్రమం” అని పార్టీ రాష్ట్ర వ్యవహారాల చీఫ్ సజ్జల రామకృష్ణారెడ్డి గీతోపదేశం చేశారు.
మంగళవారం నాడు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీవో ఆఫీసుల ముందు.. పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తారు. ప్లకార్డులు ప్రదర్శిస్తారు. రైతులతో కూర్చుని ధర్నాలు చేస్తారు. అయితే.. ఇవన్నీ శాంతి యుతంగానే చేపట్టాలని సజ్జల సూచించారు. ఎక్కడా వివాదాల జోలికి పోకూడదన్నారు. ఇక, ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయనే ఆవిష్కరించారు. వాస్తవానికి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు ఉద్యమ స్థాయిలో విజృంభించాల్సిన కీలక నేత జగన్. పార్టీలో ప్రతి ఒక్కరూ ఆయన నేతృత్వాన్నే కోరుకుంటున్నారు. కానీ, చిత్రంగా జగన్ మాత్రం మౌనంగా ఉంటారు. సజ్జల మాత్రం తెరమీదికి వస్తారు.
గతంలోనూ ఫీజు రీయింబర్స్‌మెంటు, ఇతర పథకాలపై కూడా ఇలానే నిరసనలు చేపట్టినా.. అవి సక్సెస్ కాలేదు. జగన్ లేని కార్యక్రమాలకు మేం వచ్చది లేదని చాలా జిల్లాల్లో కార్యకర్తలు భీష్మించారు. దీంతో నాయకులు వారిని బ్రతిమాలి.. బామాలి తెచ్చుకుని ఫొటోలకు ఫోజులు, మీడియా ముందు బైట్లు ఇచ్చి మమ అనిపించారు. దీంతో వ్రతమూ చెడింది.. ఫలితమూ పోయింది. ఏదో పేరు కోసం.. చేసిన కార్యక్రమాలుగానే మిగిలిపోయాయి. ఇక, ఇప్పుడు కీలకమైన సమస్యపై కదం తొక్కాల్సిన సమయంలోనూ జగన్.. ఇంట్లో కూర్చుని.. “ముందు మీరు.. తర్వాతే.. నేను” అనే తరహాలో చేస్తున్న పనులతో నాయకులు విస్తుబోతున్నారు.
This post was last modified on September 6, 2025 10:04 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…