ఏపీలో కూటమి సర్కారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, అందులో భాగంగానే వైసీపీ నేతలను వరుసబెట్టి అరెస్టు చేస్తోందని ఆరోపిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. తననూ అరెస్టు చేసుకోండి అంటూ చాలా రోజులుగా సవాల్ విసురుతున్నారు. అంబటి సవాళ్లు ఇప్పుడు నిజమైపోయాయి. అంబటిపై విచారణకు ఏపీ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచే ఈ వ్యవహారంలో విచారణ మొదలు అయ్యే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వైసీపీ పాలనలో అంబటి రాంబాబు రెండున్నరేళ్ల పాటు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారనేది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. అయితే ఈ ఆరోపణలపై తాజాగా అటు ప్రభుత్వంతో పాటు ఇటు విజిలెన్స్ శాఖకు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా అంబటిపై వి,చారణకు ఆదేశిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
అయినా అంబటిపై వెల్లువెత్తిన విమర్శలు ఏమిటన్న విషయానికి వస్తే… వైసీపీ హయాంలో ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి తెర తీసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఒకే చోట స్థలాలు ఇచ్చేలా ప్రైవేటు స్థలాలను కొన్నారు. ఇలా కొన్న భూములున్నీ కూడా వైసీపీ నేతల నుంచే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ భూములను ఆయా నేతలు అతి తక్కువ ధరలకు కొని ప్రభుత్వానికి మాత్రం అత్యదిక ధరలకు అందించారు. ఈ వ్యవహారంలో అంబటి భారీగా చక్రం తిప్పారట. ఎకరాను రూ.10 లక్షలకు కొని ప్రభుత్వానికి మాత్రం రూ.30 లక్షలకు అమ్మారట. ఇక ప్రైవేట్ వ్యాపారులనూ ఆయన బెదిరించి వసూళ్లు సాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై ఇప్పుడు అంబటి విచారణను ఎదుర్కోనున్నారు.
This post was last modified on September 5, 2025 12:58 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…