భారత్ నుంచి మరో విప్లవాత్మక ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన 32-బిట్ మైక్రోప్రాసెసర్ ‘విక్రమ్ 3201’ను తాజాగా ఆవిష్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని “డిజిటల్ డైమండ్”గా అభివర్ణించారు. “గత శతాబ్దం ఆయిల్ ఆధారంగా నడిచిందంటే.. ఈ శతాబ్దం చిప్‌లపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన పేర్కొనడం ఈ ఆవిష్కరణ ప్రాధాన్యాన్ని మరింతగా చాటిచెప్పింది.
‘విక్రమ్ 3201’ అనేది 2009లో వాడిన 16-బిట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్. ఇది ఒకేసారి 32 బిట్ల డేటాను ప్రాసెస్ చేయగలదు. ముఖ్యంగా స్పేస్ మిషన్‌ల కోసం డిజైన్ చేయబడింది కాబట్టి -55 నుంచి 125 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పనిచేసే సామర్థ్యం ఉంది. అంతరిక్షంలో రాకెట్లకు, శాటిలైట్‌లకు ఇది అత్యంత అవసరం. అదేవిధంగా Ada ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ భాష నమ్మకమైనది కాబట్టి ఎయిర్ ట్రాఫిక్, లాంచ్ వాహనాలు వంటి సున్నితమైన రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు.
ఇక ఈ చిప్ ద్వారా భారతదేశం “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యానికి మరింత దగ్గరైంది. ఇప్పటి వరకు అంతరిక్ష మిషన్ల కోసం చిప్‌లను చైనా, తైవాన్, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్వదేశీ చిప్‌తోనే అవసరాలు తీరతాయి. దీని వలన ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా ఇతర రంగాలకు కూడా ఈ సాంకేతికత విస్తరించనుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు వంటి విభాగాలకు స్వదేశీ చిప్‌లు అందుబాటులోకి రావడం ఖాయం.
ప్రస్తుతం భారత్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ దాదాపు 50 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది. 2030 నాటికి అది 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటుతుందని అంచనా. ఇప్పటికే 10 ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ల కోసం 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, హెచ్‌సీఎల్ – ఫాక్స్‌కాన్ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నాయి. రాష్ట్రాల వారీగా గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్‌లో కొత్త యూనిట్లు ఏర్పడుతున్నాయి.
మొత్తానికి, ‘విక్రమ్ 3201’ చిప్ కేవలం స్పేస్ మిషన్‌లకే పరిమితం కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వబోతోంది. స్వదేశీగా చిప్‌లు తయారు చేయగల సామర్థ్యం ఉండడం వలన ఉద్యోగాలు పెరుగుతాయి, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు కూడా భారత్‌లో ఉత్పత్తి కేంద్రాలు పెట్టడానికి ఆసక్తి చూపుతాయి. చిన్న చిప్ అయినా, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెద్దదే కానుంది.
This post was last modified on September 2, 2025 8:09 pm
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…