కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డలో పిల్లర్లు కూలిన ఘటన నానాటికీ తెలంగాణ రాజకీయాలను వేడేక్కిస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే జస్టిస్ సీపీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, కమిషన్ విచారణకు కేసీఆర్ సహా పలువురు కీలక నేతలు హాజరు కావడం, ఆపై కమిషన్ నివేదిక సమర్పణ, ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా ప్రాజెక్టును కట్టిన కేసీఆర్…అందులో తన తప్పు ఉందని ఒప్పేసుకున్నారన్న వాదన అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.
రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరునే కాళేశ్వరంగా మార్చిన కేసీఆర్ సర్కారు ముందుకు సాగింది. అయితే కాంగ్రెస్ ఈ ప్రాజెక్టును తుమ్మడిహెట్టి నుంచి ప్రారంభించాలని చూస్తే.. కేసీఆర్ మాత్రం తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేసి ప్రాజెక్టును కొనసాగించారు. ప్రాజెక్టు పూర్తి అయిన అనతి కాలంలోనే… అది కూడా కేసీఆర్ సీఎంగా ఉండగానే మేడిగడ్డ పిల్లర్లు కూలిపోయాయి. దీంతో కేసీఆర్ చిక్కుల్లో పడిపోయారు. సరైన సాంకేతికతను వినియోగించకుండా తూతూమంత్రంగా ప్రాజెక్టును నాసికరంగా నిర్మించిన కారణంగానే పిల్లర్లు కూలయాన్నది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ
తాజాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై తెలంగాణ అసెంబ్లీ చర్చ జరుగుతోంది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ రాత్రి పొద్దుపోయేదాకా సభలో దీనిపై వాడీవేడీ చర్చ జరిగింది. అయితే ఈ చర్చకు కేసీఆర్ గైర్హాజరు అయ్యారు. ఫలితంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన లెక్కలేనన్ని విమర్శలకు ఒక్క హరీశ్ రావు మాత్రమే సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంగా హరీశ్ రావు కొన్నిసార్లు తడబడిన వైనం కనిపించింది. అలా కాకుండా కేసీఆర్ సభకు హాజరై ఉండి ఉంటే… మామా అల్లుళ్లు కాంగ్రెస్ పార్టీ దీటుగానే ఎదుర్కొని ఉండేవారన్న వాదనలు వినిపిస్తున్నాయి. హరీశ్ మాదిరే సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ కూ అపార అవగాహన ఉందన్న విషయం తెలిసిందే.
అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం సవాళ్ల మీద సవాళ్లు విసిరింది. దమ్ముంటే కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చకు కేసీఆర్ హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే… కేసీఆర్ ఈ చర్చలో పాలుపంచుకోకపోతే…కాళేశ్వరం ప్రాజెక్టు తన తప్పదం వల్లే కూలిందని ఒప్పుకున్నట్టేనని సంచలన కామెంట్ చేశారు. ఆ నిందను వద్దనుకుంటే… కేసీఆర్ సభకు హాజరై… తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని సవాల్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ సభకు హాజరు కాని నేపథ్యంలో కోమటిరెడ్డి చెప్పినట్లుగా కేసీఆర్ తన తప్పును ఒప్పుకున్నట్టే అయ్యిందని జనం అనుకుంటున్నారు.
This post was last modified on September 1, 2025 12:51 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…