Political News

చంద్ర‌బాబు నిఘా నేత్రం: ఇక త‌ప్పు చేస్తే క‌ష్ట‌మే..!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, వివాదాల‌కు త‌న‌దైన శైలిలో చెక్ పెట్ట‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క, ఇక నుంచి మ‌రో లెక్క అన్న‌ట్టుగా చంద్ర‌బాబు నిర్ణ‌యాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు.

ముగ్గురు ఐఏఎస్‌ల‌తో ఏర్పాటుచేసిన అంత‌ర్గ‌త క‌మిటీ ఇటీవ‌ల ఆయ‌న‌కు నివేదిక స‌మ‌ర్పించింది. నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల దూకుడును క‌ట్ట‌డి చేయ‌డంతో పాటు అభివృద్ధిని ఎలా ప‌రుగులు పెట్టించాల‌న్న విష‌యంపై బాబు దృష్టి పెట్టారు.

ప్ర‌స్తుతం రెండు ర‌కాలుగా ప్ర‌తిబంధ‌కాలు ఏర్పడుతున్నాయి. వీటి కార‌ణంగానే నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప‌నులు ముందుకు సాగ‌డం లేద‌న్న‌ది చంద్ర‌బాబు గుర్తించిన విష‌యం. దీనికి అడ్డుక‌ట్ట వేసి, నాయ‌కుల జోక్యాన్ని నివారించి ప‌నులు ముందుకు సాగేలా చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే మూడు నెల‌ల కింద‌ట అంత‌ర్గ‌త క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీలో సీనియ‌ర్ ఐఏఎస్‌లు, ఓ కీల‌క అధికారి ఉన్న‌ట్టు తెలిసింది. వీరు రూపొందించిన నివేదిక కూడా చంద్ర‌బాబుకు చేరింది.

దీనిలో ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ నాలుగు సూచ‌న‌లు చేసిన‌ట్టు స‌మాచారం.

నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి ప‌నుల‌లో నాయ‌కుల పాత్ర‌ను త‌గ్గించ‌డం

క‌మీష‌న్లు, దందాల‌కు చోటు లేకుండా పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం

ఈ రెండు విష‌యాల‌పై ఫోక‌స్ పెంచ‌డం ద్వారా ప‌నులు చేయొచ్చ‌ని నివేదిక తెలిపింది. ఈ క్ర‌మంలో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంపైనా నిఘా పెంచాల‌ని కీల‌క సూచ‌న చేసింది.

దీని లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌నులు, వాటిని తీసుకున్న కాంట్రాక్ట‌ర్ల‌ను అధికారుల‌కు అటాచ్ చేస్తారు. డిప్యూటీ క‌లెక్ట‌ర్ స్థాయి అధికారికి త‌గ్గ‌ని అధికారుల‌ను ఈ ప‌నుల‌కు పుర‌మాయిస్తారు.

త‌ద్వారా ఎప్ప‌టి క‌ప్పుడు లెక్క‌లు చూడ‌డం, ఏ ప‌నికి ఎంత జ‌రిగిందో తేల్చ‌డం వంటివి కీల‌కం. అంతేకాదు, నాయ‌కుల ప్ర‌మేయాన్ని కూడా వీరే ప‌రిశీలిస్తారు. ఏమైనా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఉంటే డిప్యూటీ క‌లెక్ట‌ర్ స్థాయి అధికారుల‌కే నాయ‌కులు విన్న‌వించాల‌ని సూచించారు.

ప్ర‌తి పని పురోగ‌తికీ స‌ద‌రు అధికారిని బాధ్యుడిని చేయ‌డం ద్వారా ప‌నులు పార‌దర్శ‌కంగా జ‌ర‌గ‌డంతో పాటు నాయ‌కుల ఒత్తిడి, ప్ర‌మేయం కూడా త‌గ్గించ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

This post was last modified on August 28, 2025 12:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

పార్లమెంటులో కరిచే కుక్కలు ఉన్నాయి – కాంగ్రెస్ ఎంపీ

కరిచే కుక్కలు లోపల ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిన్న ఆమె…

2 hours ago

అఖండ 3 ఉందని హింట్ ఇస్తున్నారా ?

రేపు రాత్రి అఖండ 2 తాండవం ప్రీమియర్లతో బాలయ్య షో ప్రారంభం కానుంది. ఓజి తర్వాత మళ్ళీ అంత పెద్ద…

4 hours ago

బైకర్ సౌండ్ లేదు… మురారి ఆగడం లేదు

శర్వానంద్ సినిమాలు విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. కారణం ఒకేసారి రెండు రిలీజులు రెడీ కావడం. అంతా సవ్యంగా జరిగి ఉంటే…

5 hours ago

హీరోయిన్ సీన్లు క‌ట్ చేయించిన హీరో

హ‌నుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ స‌జ్జా. ఐతే ఈ…

5 hours ago

శ్రీవారి వైకుంఠ ద‌ర్శ‌నం… సెక‌నుకు 8 మంది!

ఔను! నిజం. మీరు చ‌దివింది అక్ష‌రాలా క‌రెక్టే!. సెక‌ను అంటే రెప్ప‌పాటు కాలం. ఈ రెప్ప‌పాటు కాలంలోనే అఖిలాండ కోటి…

5 hours ago

సచివాలయంలో బ్యారికెట్లపై సీఎం బాబు ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబు తాను వెళ్లిన ప్రతి చోట ప్రజలతో మమేకం అవుతుంటారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం పరదాలు…

5 hours ago