భారత దేశంపై అమెరికా విధిస్తున్న అదనపు సుంకాలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే 25 శాతం మేరకు సుంకాలు విధించిన అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న నెపంతో భారత్‌పై మరో 25 శాతం మేరకు సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా అంతర్గత భద్రతా విభాగం సమాచారం కూడా ఇచ్చింది. వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాల్లో భారత్‌పై విధించిన సుంకాలే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ప్రస్తుతం సుంకాల శాతం 50 శాతానికి పెరిగింది.
సుంకాల పెంపుతో అమెరికాకు భారత్ నుంచి జరిగే సుమారు 5 లక్షల 25 వేల కోట్ల రూపాయల ఎగుమతులపై ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతానికి అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఉన్న మొబైల్ ఫోన్లు, పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, ఔషధాలు మినహా, మిగతా అన్ని రంగాలకు చెందిన ఉత్పత్తులపై సుంకాల ప్రభావం పడనుంది. వీటిలో వస్త్ర పరిశ్రమ, దుస్తులు, రత్నాలు, బంగారం, ఆభరణాలు, రొయ్యలు, చెప్పులు, ఆట బొమ్మలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్తు, మెకానికల్ యంత్రాలు వంటివి ఉన్నాయి.
అయితే అమెరికా సుంకాలు విధించినప్పటికీ కొన్ని వస్తువులపై వాటికి మినహాయింపు ఉంది. ఈ జాబితాలో ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. ఇక అమెరికా విధిస్తున్న సుంకాల వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ‘సొంత’ వైద్యానికి సిద్ధమైంది. మేడ్ ఇన్ ఇండియా (స్వదేశీ) ఉత్పత్తులకు ఊతం ఇవ్వడం ద్వారా భారత్ దీనిని ఎదుర్కొంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెబుతున్నారు.
దేశీయ మార్కెట్లను బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘స్వదేశీ ఉత్పత్తుల’ అవసరాన్ని నొక్కి చెప్పారు. స్వదేశీ, మేక్ ఇన్ ఇండియా అనేవి దోహదపడతాయని అంటున్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినా ఉత్పత్తి మాత్రం మనదేశంలోనే జరగాలని స్పష్టం చేస్తూ, స్వదేశీ అనేది ప్రతి ఒక్కరి జీవిత మంత్రంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మరోవైపు రష్యా సహా ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకునే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా అమెరికా విధించిన సుంకాల సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మరి ఈ సొంత మంత్రం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
This post was last modified on August 27, 2025 4:37 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…