Political News

సీనియర్లతో సమస్య కాదు.. కొత్త ఎమ్మెల్యేలతోనే చిక్కు..

తెలుగు రాజకీయాల్లో పాత తరానికి కొత్త తరానికి మధ్య సంధిదశ అధినేతగా ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని చెప్పాలి. ఆయనలో సంప్రదాయ రాజకీయ నాయకుడికి ఉండే లక్షణాలతో పాటు కొత్త తరం నేతలకు ఉండే లక్షణాలు కనిపిస్తాయి. పాలన విషయంలో కొత్త తరహాలో ఆలోచించే ఆయన కట్టు తప్పే పార్టీ నేతలపై చర్యల విషయంలో మాత్రం పాతతరం అధినేతగా వ్యవహరిస్తూ ఉంటారు. క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు కట్టుదాటిన నేతలపై చర్యల విషయంలో ఓపెన్‌గా స్పందిస్తారే కానీ తనకు పట్టనట్లుగా అస్సలు వ్యవహరించరు.

మాటల్లో అదిరే కాఠిన్యాన్ని ప్రదర్శించే చంద్రబాబు చేతల విషయానికి వచ్చినప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. పార్టీ నేతలకు సంబంధించి ఇటీవల కాలంలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్న వేళ ఆయన అలాంటి నేతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ఇప్పటికే పలుమార్లు చెప్పటం తెలిసిందే. తరచూ చర్యలు ఉంటాయన్న వార్నింగ్ తప్పించి చేతల్లో చూపించకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘చంద్రబాబుకో దండం. ఎప్పుడూ తీసుకునే చర్యల గురించి చెప్పటం కాదు చేతల్లో చూపిస్తే మంచిది’ అంటూ ఒక సీనియర్ నేత కుండబద్ధలు కొట్టగా పలువురు ప్రజాప్రతినిధులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

తాజాగా కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలకు సంబంధించి చంద్రబాబు నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ విధానాలు క్రమశిక్షణ తెలుసని దీంతో వారు పద్దతిగా నడుచుకుంటున్నారని కానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి ముఖాముఖి మాట్లాడినట్లుగా చెప్పారు.

వారితో తాను వ్యవహరించే విధానం ఎలా ఉంటుందన్న దానిపై ఆయన కొత్త మాటను చెప్పుకొచ్చారు. ‘‘గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు ఒకసారి పిలిచి పద్దతి మార్చుకోవాలని చెబుతా. తీరు మారకపోతే రెండోసారీ పిలిచి చెబుతా. అప్పటికీ మారకపోతే మూడోసారి చెప్పటం ఉండదు. కఠినంగా వ్యవహరిస్తా. అసలు రెండోసారి పిలవాలా? వద్దా? అన్నది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ తరహా వార్నింగ్‌లు చంద్రబాబు తరచూ చెబుతుంటారే తప్పించి ఆచరణలో చేసి చూపించింది లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కట్టుదాటి కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న ఎమ్మెల్యేలను ఎందుకు ఉపేక్షించాలని ప్రశ్నిస్తున్నారు. తప్పులు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని అప్పుడే మిగిలిన వారికి భయం భక్తి వస్తాయని అందుకు భిన్నంగా ఎప్పుడూ మాటలకే పరిమితం కావటం తాటాకు చప్పుళ్ల మాదిరే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మాటలు వదిలి చేతల్లో చూపించే దిశగా చంద్రబాబు వ్యవహరించాలని కోరుతున్నోళ్ల పెరుగుతున్నారు.

This post was last modified on August 24, 2025 12:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

1 hour ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

4 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

4 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

5 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

7 hours ago