Political News

ఏంటా బిల్లు.. ఏమా కథ.. బీజేపీ నిజాయితీ ఎంత?

కేంద్ర ప్రభుత్వం ఉరుములు లేని పిడుగు మాదిరిగా తీసువచ్చిన మూడు రాజ్యాంగ సవరణల బిల్లు ఇప్పుడు దేశం యావత్తును కుదిపేస్తోంది. ఏ ఇద్దరు నేతలు కలిసినా ఈ బిల్లుపైనే చర్చించుకుంటున్నారు. ఇక మేధావులు తమ తమ శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల నుంచి కేంద్ర, రాష్ట్ర స్థాయి మంత్రుల వరకు కూడా తీవ్ర నేరాల్లో చిక్కుకుని జైలు పాలైతే.. 30 రోజులకు కూడా వారికి బెయిల్ దక్కకపోతే.. 31వ రోజు ఆటోమేటిక్‌గా వారు ఆయా పదవులను కోల్పోతారు. ఈ నేరాలు 5 ఏళ్లకు మించి జైలు శిక్ష పడే కేసులు ఉండాలి. ఇదే ఇతమిత్థంగా ఈ బిల్లు సారాంశం.

ఇది 130వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం తీసుకురావాలని భావిస్తున్న బిల్లు. దీనిని చిత్రంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజుకు ముందు బుధవారం లోక్‌సభలోను, చివరి రోజు (గురువారం) రాజ్యసభలోనూ ప్రవేశ పెట్టారు. మూజువాణి ఓటు (చేతులు ఎత్తడం ద్వారా) ఈ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు ప్రకారం ప్రధానంగా మూడు ఆర్టికల్స్ మార్పు చేయడంతోపాటు 130వ రాజ్యాంగ సవరణ కింద దీనిని అమలు చేస్తారు.

ఓకే.. ఇంత వరకు బాగానే ఉంది. ఎవరు అవినీతి, అక్రమాలు చేసినా ఉపేక్షించరాదన్నది ప్రధాన చర్చ. దీనికి సభ్యసమాజం కూడా అంగీకరిస్తుంది. తీవ్ర నేరాలు చేసిన వారు ముఖ్యమంత్రులుగా ఉన్నారన్న చర్చ కూడా దేశంలో సాగుతోంది. అయితే వాస్తవానికి ఈ బిల్లును తీసుకురావడం వెనుక ఉన్న ఉద్దేశాలను పక్కన పెడితే.. అసలు రాజకీయాల్లో నిజాయితీ, నీతి, సచ్చీలురను కోరుకుంటున్న బీజేపీ నిజంగానే అలా ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రభుత్వాలు కూలగొట్టేందుకు తప్ప ఈ బిల్లు ప్రధానంగా దేశానికి ఒనగూర్చే ప్రయోజనం లేదన్న వాదనకు సరైన సమాధానం కేంద్రం నుంచి లేకుండా పోయింది.

ఈ ప్రశ్నలకు బదులేది?

తాజా బిల్లుపై బీజేపీ చెబుతున్న మాట, చేస్తున్న ప్రచారం నిజాయితీతో కూడిన రాజకీయాలు తీసుకు రావడం, నాయకులు సచ్చీలురుగా ఉండేలా తీర్చిదిద్దడం, అక్రమార్కులను రాజకీయాల్లో లేకుండా చేయడం. ఇతమిత్థంగా ఈ మూడు అంశాలనే బీజేపీ నాయకులు చెబుతున్నారు. కానీ వాస్తవం వేరేగా ఉంది. ఆ పార్టీ ఇప్పటి వరకు చేసిన నిర్ణయాలు, వేసిన అడుగులు చూస్తే.. తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ సీఎం జగన్‌ను వెనుకేసుకురావడం లేదా? 11 సంవత్సరాలుగా ఆయనపై సీబీఐ కన్నెత్తి కూడా చూడలేదంటే ఏంటి అర్థం? తెరవెనుక ఎవరు ఉన్నారు? ఆయన మద్దతుతో పార్లమెంటులో బిల్లులను పాస్ చేయించడం లేదా? అనేది ప్రశ్న.

మహారాష్ట్రలో అజిత్ పوار్ 70 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని.. తాము అధికారంలోకి వస్తే ఆయన అంతు చూస్తామన్న ప్రధాని మోడీ ఊరూ వాడా తిరిగి ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. కానీ ఏమైంది? ఎన్నికల ఫలితాలకు ముందే అదే అజిత్ పوار్ను తమతో కలుపుకొని ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిని చేయలేదా? మరి ఏడాది కిందట చేసిన అవినీతి, అక్రమాలు, తీవ్ర నేరాల ఆరోపణలు ఏమయ్యాయి?

ఇక అస్సాంలో కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టించి అధికారంలోకి తీసుకువచ్చిన హిమంత బిశ్వశర్మను ముప్పుతిప్పలు పెట్టిన బీజేపీ.. ఆయన వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, తాము అధికారంలోకి వస్తే వాటిని కక్కిస్తామని నేరుగా అమిత్ షా వంటి అగ్రనేతలే ఊదర కొట్టారు. కానీ ఏం జరిగింది? రాత్రికి రాత్రి కండువా మార్చుకుంటానని కబురు పెట్టగానే కమల దళంలో కలుపుకొని ఏకంగా ఇతర నాయకులను కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని హిమంతకు అప్పగించలేదా? ఇదేంనీతి?

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రైట్ హ్యాండ్‌గా ఉన్న సువేందు అధికారిపై గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు శారదాచిట్ ఫండ్ కుంభకోణంలో కీలక పాత్ర ఉందని, వందల కోట్ల రూపాయల అవినీతిలో ఆయన పాత్ర ఎనలేనిదని బీజేపీ నాయకులు చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ నుంచి అమిత్ షా వరకు నిప్పులు చెరిగారు. కానీ ఏం చేశారు? పొద్దు పొద్దున్నే పార్టీలో చేర్చుకుని ఆయనను పార్టీలో కీలక నేతగా ప్రకటించలేదా? ఆ తర్వాత ఆయనపై చేసిన ఆరోపణలు ఏమయ్యాయి?

ఇక జార్ఖండ్‌లో అప్పటి ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను లోబరుచుకునే ప్రయత్నాలు బెడిసి కొట్టిన దరిమిలా ఆయనపై గనుల అక్రమాల కేసు పెట్టి జైలుకు పంపారు. దీంతో సొరేన్ తమకు అత్యంత విశ్వాసపాత్రుడు, తమ ఇంట్లో మనిషిలా ఉండే చెంపయ్ సొరేన్‌ను ముఖ్యమంత్రి చేస్తే.. ఆయనను లోబరుచుకుని పార్టీని విడదీసే ప్రయత్నం చేయలేదా? అయితే అదృష్టవశాత్తు హేమంత్‌కు బెయిల్ లభించి, ఎన్నికల సమయంలో ప్రజలు తీర్పు ఇవ్వడంతో తిరిగి సొరేన్ అధికారం నిలబెట్టుకున్నారు.

ఇక అన్నిటికన్నా కీలకం ఢిల్లీ. మద్యం స్కాం పేరుతో అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించి జైలులో పెట్టారు. కానీ ఆయన రాజీనామా చేయలేదు. రాజీనామా చేయించాల‌ని చేసిన ప్రయత్నాలు కూడా బీజేపీని ఇరుకునపెట్టేశాయి. అయినప్పటికీ ఆప్‌ను చీల్చి కీలక నాయకులను తమ దారిలోకి తెచ్చుకుని మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయలేదా? మరి ఇదేం నీతి?

ఇవన్నీ రాజకీయ అక్రమాలు కావా? బీజేపీ చేస్తున్నవి రాజకీయ నేరాలు కావా? ఇప్పుడు నేరస్తుల పేరుతో విపక్షాల పాలిత రాష్ట్రాలపై అక్కసుతోనే ఈ బిల్లును తీసుకువస్తున్నారన్న చర్చల్లో అర్థం లేదని ఎలా చెప్పగలం? అందుకే ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి. మూడు వ్యవసాయ చట్టాల మాదిరిగా దీనిని కూడా వెనక్కి తీసుకునేలా చేస్తామన్న విపక్షాలు ఏమేరకు విజయం దక్కించుకుంటాయో చూడాలి.

This post was last modified on August 23, 2025 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

29 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago