Political News

మా మంచి మంత్రి: చంద్రబాబు మార్కులు వేశారు..!

చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు మహిళా మంత్రుల్లో ఒకరి వ్యవహారం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలో ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ మంత్రిగా మంచి మార్కులు వేసుకుంటున్నారని ఇటు పార్టీ వర్గాల్లోను, అటు సీఎం స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది.

వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సంజీవరెడ్డి గారి సవిత ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. వీరిలో వయసు పరంగా చూసుకుంటే సంజీవరెడ్డి గారి సవిత కొంచెం ఎక్కువనే చెప్పాలి. అయినప్పటికీ ఆమె నిరంతరం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మమేకం కావడం, ప్రభుత్వపరంగా చేస్తున్న కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడం, యాక్టివ్‌గా ఉండడం వంటి పరిణామాలు చంద్రబాబును ఆకట్టుకున్నాయి.

అందుకే ఆమెను మంచి మంత్రి అంటూ ఇటీవల ప్రశంసించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సవితకు సంబంధించిన పనితీరుకు చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా విస్తృతంగా చేస్తున్నారని, యాక్టివ్‌గా పాల్గొంటున్నారని ఆమెకు కితాబిచ్చారు.

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమలు తర్వాత సవిత అటు నియోజకవర్గంలోనూ, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నారు. రైతులతోనూ, మహిళలతోనూ మమేకం అవుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి, గత వైసీపీ ప్రభుత్వం మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

మహానాడు సమయంలో ఆమె సైకిల్ తొక్కారు. దాదాపు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సైకిల్ యాత్ర ద్వారా పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపారు. మహానాడు విజయానికి దోహదపడ్డారు. తాజాగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నేరుగా ఆమె ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు.

దాంతో సీఎం చంద్రబాబు ఆమె కృషి పట్ల, ఆమె అంకితభావం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ మరోసారి ఆమెను ప్రశంసించడం విశేషం. వయసుతో సంబంధం లేకుండా ప్రజల్లో మమేకమవుతున్నారని, మంచి మంత్రి అని మంత్రి సవితను చంద్రబాబు ప్రశంసించారు.

నిజానికి పార్టీ పరంగా పెనుకొండ నియోజకవర్గంలో మంత్రికి ఇబ్బందులు ఎదురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వాటితో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని పోవడం, సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడం, పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించడం ద్వారా సవిత చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఇదే ఆమెకు మంచి మార్కులు పడేలా, మంచి పేరు తెచ్చేలా చేసిందన్నది వాస్తవం అంటున్నారు నాయకులు.

This post was last modified on August 20, 2025 12:55 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

49 minutes ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

3 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

3 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

5 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

6 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

7 hours ago