Political News

ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి – ఎవరీ రెడ్డిగారు

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసింది. తెలుగు వారైన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఈ పోస్టుకు ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం లో జన్మించిన సుదర్శన్ రెడ్డి హైదరాబాదులోనే విద్యను కొనసాగించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు.

తర్వాత కాలంలో న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా కూడా హైకోర్టులో సేవలు అందించారు. సామాన్యులకు పెద్దపీట వేశారన్న పేరు తెచ్చుకున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2007 నుండి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ సమయంలోనూ పలు కీలక తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ అనంతరం గోవా తొలి లోకాయుక్తగా ఆయన పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. నల్సార్ లా కాలేజీలో ఆయన పలు ఉపన్యాసాలు కూడా ఇచ్చారు.

తాజాగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడంపై న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తొలిసారి తెలంగాణ వాసికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం రావడం సంతోషకరమని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి తరఫున తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఏకగ్రీవంగా బలపరుద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన కొద్ది సమయంలోనే ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం విశేషం.

కేవలం పోటీనే!

జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటికీ ఆయన గెలుపు కష్టమనే అభిప్రాయం పార్లమెంటు వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉభయ సభల్లో అధికార ఎన్డీయే పక్షానికే బలమైన మద్దతు ఉంది. దీంతో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం ఖాయమని అంటున్నారు. అయితే ఇండియా కూటమి మాజీ న్యాయమూర్తిని ఎంపిక చేయడం వల్ల ఎన్నికల్లో పోటీ తప్పదని చెబుతున్నారు.

This post was last modified on August 19, 2025 2:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

20 minutes ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

26 minutes ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

52 minutes ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

2 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…

3 hours ago