ఏపీ మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు నారా లోకేష్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలుసుకోనున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇటీవల సెమీ కండెక్టర్ ప్రాజెక్టును కేటాయించిన విషయం తెలిసిందే. సుమారు 435 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజె క్టుతో రాష్ట్రంలో 3 వేల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభించనున్నాయి. అయితే.. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ, నారా లోకేష్ ప్రయత్నం, పెట్టుబడుల విషయంలో కేంద్రాన్ని ఒప్పించడంతో సెమీ కండెక్టర్ ప్రాజెక్టు ఏపీకి లభించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు చెప్పడంతోపాటు.. మరిన్ని పెట్టుబడులు వచ్చేలా కేంద్రంతో చర్చించేందుకు నారా లోకేష్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై కూడా ఆయన చర్చించనున్నట్టు తెలి సింది. జాతీయ నూతన విద్యావిధానం అమలు సహా గిరిజన ప్రాంతాల్లో రహదారి ఫ్రాజెక్టులకు నిధులు తీసుకువచ్చే అంశాలపై నా నారా లోకేష్ చర్చించనున్నారు. అదేవిధంగా రాజధాని అమరావతి ప్రాజెక్టు పురోభివృద్ధిపై కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ కు వివరించనున్నారు. మొత్తంగా నారా లోకేష్ పర్యటన ద్వారా కేంద్రం నుంచి మరిన్ని ప్రాజెక్టు తీసుకువచ్చే ప్రణాళికలు ఉన్నా యని తెలుస్తోంది.
దేశానికి క్షమాపణలు చెప్పాలి!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. ఆయన దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశం మొత్తం జాతీయ పతాకాన్ని ఎగురవేసి.. పండుగ చేసుకుందని.. కానీ, మాజీ ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధినేతగా చెప్పుకొనే జగన్ మాత్రం సిగ్గుపడేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. కనీసం జెండా వందనం కూడా చేయలేదన్నారు. ఇది కేవలం రాష్ట్రానికే కాదు.. దేశం మొత్తానికీ అవమానమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్.. దేశానికి క్షమాపణలు చెప్పాలని నారా లోకేష్ పేర్కొన్నారు.
This post was last modified on August 18, 2025 6:34 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…