ప్రస్తుతం వైసీపీ 11 స్థానాలకు పరిమితమై.. దిక్కులు చూస్తోంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇక, ప్రజల్లోనూ పెద్దగా పుంజుకుంటున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. అయినా.. కొన్ని కొన్ని చోట్ల మాత్రం.. వైసీపీ నేతలే… పవర్ కేంద్రాలుగా మారిపోయారు. వారే అధికారులను ఆడిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఉదాహరణకు చిత్తూరు జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ తిరుపతి నియోజకవర్గంలో జనసేన విజయం దక్కించుకుంది. ఇక, టీడీపీకి కూడా మెజారిటీ భారీగా ఉంది. అయినా.. ఇక్కడి అధికారులు మాత్రం.. వైసీపీ కీలక నేత కనుసన్నల్లోనే నడుస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఆయనకు ఉన్న పరిచయాలు, గతంలో సదరు ఉన్నతాధికారులు పొందిన మేళ్లు.. వంటివి కూటమి ప్రభు త్వం ఇస్తున్న ఆదేశాలను కూడా ఖాతరు చేయని స్థాయిలో అధికారులు వైసీపీ నాయకుడు చెప్పినట్టు నడుచుకునేలా చేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలో నియమితులై న అధికారులను రాష్ట్రంలో చాలా కీలక శాఖల నుంచి తప్పించారు. కానీ, చిత్తూరులో మాత్రం ఈ పనికావ డం లేదని.. దీనికి సదరు వైసీపీ సీనియర్ నాయకుడి నుంచి ఒత్తిడులు వస్తున్నాయని సమాచారం. దీంతో అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
ప్రధానంగా బదిలీల విషయంలో ఇప్పటి వరకు ఒక్క అధికారిని కూడా కదిలించలేక పోయారన్న టాక్ కూటమి నాయకుల్లోనే వినిపిస్తోంది. పైగా.. ఇది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చూస్తున్న శాఖే కావడం.. పవన్‌కు, సదరు వైసీపీ నాయకుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉన్నప్పటికీ.. పవన్ చెప్పినట్టు ఎవరూ నడుచుకోవడం లేదని తెలుస్తోంది. జిల్లాలో అటవీ భాగం ఎక్కువ. అదేసమయంలో ఎర్రచందనానికి కూడా ఈ జిల్లా పెట్టింది పేరు. దీంతో గతంలోను.. ఇప్పుడు కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.
దీనిని గమనించిన పవన్ కల్యాణ్.. కీలక అధికారులను మార్చాలని నిర్ణయించి ఆరు మాసాలు అయింది. కానీ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయన చెప్పినట్టు జరిగినా.. చిత్తూరులో మాత్రం ఉన్నతస్థాయి అధికారు లు ఫైళ్లను పక్కన పెట్టారు. దీనికి కారణం.. వైసీపీ సీనియర్ నేత హవానేనని కూటమి నాయకులు అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. పై నుంచి కింది స్థాయిదాకా పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది.. సదరు నేత కనుసన్నల్లోనే మెలుగుతున్నారు. అటవీ భూముల అక్రమణ విషయంలో సర్కార్ ఆదేశాల తర్వాత కూడా… నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం వెనుక.. పవర్ లో లేకపోయినా.. పవర్ కేంద్రంగా మారిన సదరు నేతేనని తెలుస్తోంది.
This post was last modified on August 16, 2025 12:39 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…