Political News

ఫామ్ హౌస్ లో కేటిఆర్, కవిత… మాట కలిసిందా?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఇప్పుడు వారసరత్వ పోరు ఓ రేంజికి చేరినట్టు బహాటంగానే చర్చ జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే అధికారమంతా కట్టబెడితే… మరి తన పరిస్థితి ఏమిటని పార్టీ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆయన కుమార్తె కవిత ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ నుంచి పెద్దగా సమాధానం లేకపోవడంతో పార్టీకి దూరంగా జరిగిన ఆమె… తాను స్థాపించిన తెలంగాణ జాగృతి వేదికగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అడపాదడపా కేటీఆర్ పై సెటైర్లు సంధిస్తున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య అసలు ఇప్పుడు మాటలే లేవు.

మొన్న రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కడతా అన్నా అని కవిత అంటే.. నేను అందుబాటులో లేను అంటూ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో శుక్రవారం కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్న ఎర్రవలి ఫామ్ హౌస్ కు దాదాపుగా ఒకే సమయంలో కేటీఆర్, కవిత చేరుకున్నారు. మరి ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల మధ్య మాటలు కలిశాయా? అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.

శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో అంతా వేడుకల్లో మునిగిపోయారు. మధ్యాహ్న సమయంలో కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా ఎర్రవలి ఫామ్ హౌస్ చేరుకున్నారు. తన చిన్న కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్నాడట. ఆ అబ్బాయికి తాత గారైన కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించేందుకే కవిత ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లారట. సరే.. మనవడు, అదీ కూతురి కుమారుడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్నారంటే కేసీఆర్ సంతోషించకుండా ఉంటారా? అశీర్వదించకుండా ఉంటారా? మనసారా ఆ అబ్బాయిని ఆశీర్వదించిన కేసీఆర్ కవిత, ఆమె భర్తతోనూ కాసేపు ముచ్చటించినట్టు సమాచారం.

ఇక కవిత ఫామ్ హౌస్ కు చేరే సమయానికి కాస్త అటూఇటూగా కేసీఆర్ తో కీలక చర్చల నిమిత్తం కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ చర్చల కోసం కేటీఆర్ ఒక్కడే ఏమీ రాలేదు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లు కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక, దానిపై అసెంబ్లీలో చర్చ, త్వరలో వస్తాయని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రత్యేకించి ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తదితరాలపై చర్చించేందుకే వీరిని కేసీఆర్ ఫామ్ హౌస్ కు పిలిచినట్లు సమాచారం. మొత్తంగా వేర్వేరు కారణాలు అయినా అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవితలు దాదాపుగా ఒకే సమయంలో ఫామ్ హౌస్ లో ఉన్నారు.

ఎంతైనా తోబుట్టువులు కదా.. చాలా కాలం తర్వాత ముఖాముఖీగా కలిస్తే తప్పనిసరిగా పలకరించుకుంటారు కదా. వారిద్దరి మధ్య గొడవలు లేకపోతే… ఆ పలకరింపులు ఆప్యాయంగా ఉంటాయి కూడా. అయితే కేటీఆర్, కవితల మధ్య ఇటీవలి కాలంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. కేటీఆర్ ను కవిత నేరుగానే టార్గెట్ చేస్తున్నా… కేటీఆర్ మాత్రం తన అనుచరగణంతో కవితపై సెటైర్లు సంధిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఫామ్ హౌస్ లో వారిద్దరూ ఎదురుపడినా హాయ్ అంటే హాయ్… బాయ్ అంటే బాయ్ అన్నట్లుగానే ఉండి ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాకుండా కవిత అక్కడున్న విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ ఆమె కంటబడకుండానే తప్పించుకుని వెళ్లి ఉంటారన్న విశ్లేషణలూ సాగుతున్నాయి.

This post was last modified on August 15, 2025 10:37 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

52 minutes ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

3 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

8 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

9 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

9 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

9 hours ago