నియోజకవర్గాల రాజకీయాలు కూడా ఆసక్తిగా మారుతుంటాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడి వేడిగా ఉన్న నియోజకవర్గాలు కొన్నయితే.. ఎలాంటి వివాదాలు లేని నియోజకవర్గాలు కొన్నిఉన్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని తీసుకుంటే.. ఇక్కడి 53 నియోజకవర్గాల్లో సగానికిపైగా నియోజకవర్గాల్లో రాజకీయాలు దూకుడుగా ఉన్నాయి. అధికార పక్షం ఎమ్మెల్యేల వైఖరి కొన్ని కొన్ని చోట్ల వివాదం కూడా అవుతోంది. అయితే.. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం.. ప్రశాంతమైన పరిస్థితి నెలకొంది.
ఇలాంటి వాటిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి అసెంబ్లీ నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల చంద్రబాబు నియోజకవర్గాల పరిస్థితిపై నివేదికలు తెప్పించుకున్నారు. ర్యాండమ్‌గా పరిశీలించారు కూడా. వీటిలో కదిరి నియోజకవర్గంలో వివాదాలు లేకుండా.. పనులు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రత్యర్థి నేతల వ్యవహారంపెద్దగా లేకపోవడం.. పనులు చేసుకునే అవకాశం ఉండడంతోపాటు.. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అభివృద్ధికి కీలకంగా మారడం.. కూడా చంద్రబాబుకు సంతోషాన్నించింది.
రెండు కీలక విషయాలను ఎమ్మెల్యే కందికుంట చాలా ఇంపార్టెంట్‌గా భావిస్తున్నారు. ఇవి రెండు కూడా చంద్రబాబు పదే పదే చెబుతున్నవే కావడం గమనార్హం. 1) పీ-4: ఈ విషయంలో కందికుంట యాక్టివ్‌గా ఉన్నారు. సమాజంలోని పేదలను దత్తత తీసుకుని.. వారి అభివృద్ధికి దోహదపడడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.దీంతో తనకు పరిచయం ఉన్న ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలతో పీ-4 కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో పక్కాగా అమలు చేసేందుకు కందికుంట ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 500 మంది పేదలను గుర్తించారు.
ఇక, 2) సుపరిపాలనలో తొలి అడుగు: ఈ కార్యక్రమం కూడా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదే. ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన పనులు, చేసిన సంక్షేమం వంటి వాటిని ప్రజలకు వివరించడంతో పాటు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలన్నది చంద్రబాబు నిర్ణయం. ఈ ఆదేశాలను కదిరి ఎమ్మెల్యే తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. రోజుకు కనీసం 50 ఇళ్లకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు . ప్రబుత్వం చేస్తున్న పనులు కూడా వివరిస్తున్నారు. దీంతో కదిరి నియోజకవర్గంలో అటు అభివృద్ధితోపాటు.. ఇటు చంద్రబాబు చెప్పిన పనులు కూడా జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on August 13, 2025 9:54 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…