రాజకీయాల్లో నాయకులకు, పార్టీల అధినేతలకు అనేక ఊహలు ఉండొచ్చు. దీనిని ఎవరూ కాదనరు. అస లు ఈ ఊహలు కూడా ఉండాలి. అయితే.. కర్ర విడిచి సాము చేస్తే మాత్రం అది ప్రమాదకరంగా మారు తుంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ ఇలాంటి సామునే ఎంచుకున్నారని తెలుస్తోంది. ఒకవైపు కూటమి సర్కారు ఉరుకులు.. పరుగులు పెట్టి ప్రజల మనసులు దోచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఒక వైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి పేరులో అడుగులు వడివడిగా వేస్తోంది. ఇలాంటి సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితి చాలా ముఖ్యం.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడంలో జగన్ విఫలమవుతున్నారన్న వాదన వినిపిస్తోం ది. ఇప్పటికే సూపర్ 6 హామీలను దాదపు అమలు చేస్తున్నామని చెబుతున్న సర్కారు.. ఈ నెల 15 నుంచి అమలు చేయనున్న ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మరింత ప్లస్ కానుందన్నది వాస్తవం. పైగా.. తొలి రోజుల్లో వైసీపీ దీనిపై చేసిన ప్రచారంతో కష్టమైనా.. నష్టమైనా.. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఇది కూటమి ప్రభుత్వానికి కలిసి రానున్న పరిణామంగా చెబుతున్నారు.
అంతేకాదు. ఇప్పటి వరకు ఉన్న అంతో ఇంతో వ్యతిరేకతను కూడా ఈ ఆర్టీసీ బస్సు పూర్తిగా తుడిచేయ నుందని కూడా తెలుస్తోంది. దీనికితోడు బలమైన నాయకులు.. వాయిస్ వినిపించగల నేతలు మెండుగా ఉన్న టీడీపీ.. ఇతర పథకాల విషయంలో ఒకవేళ ఏదైనా తేడా కొడుతోందన్న సమచారం ఉంటే.. ఆ విషయంపై ప్రజలను ఒప్పించే దిశగా అడుగులు వేస్తుంది. అంటే.. వైసీపీని మించి.. అనుకూల ప్రచారం చేయనుంది. ఇక, అమరావతి రాజధాని అభివృద్ధి.. ఇక్కడ జరుగుతున్న పనులకు ప్రొజెక్షన్ పెంచను న్నారు.
ఒకరకంగా చెప్పాలంటే.. జగన్ ఊహిస్తున్నట్టు గా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయి… అది తనకు లాభిస్తుం దని భావిస్తున్నా.. ఆ వ్యతిరేకతను పెరగకుండా చేసుకులా కూటమి సర్కారు సాధ్యమైనంత వేగంగా ప్రతి వ్యూహాలు వేస్తోంది. వైసీపీకి అందని విధంగా ఉంటున్న ఈ ప్రణాళికలు.. కూటమిపై వ్యతిరేకతను రాకుం డా చూసుకునేందుకు దోహదపడనున్నాయి. ఈ విషయాన్ని గ్రహించని వైసీపీ.. 2.0పై ఆశలు పెట్టుకుంది. అలా కాకుండా.. అభివృద్ధిపై కూడా జగన్ నోరు విప్పి.. తాను ఏం చేసింది.. ఏం చేయాలని అనుకుంటున్నది కూడా వివరిస్తే.. అప్పుడు కొంత మేరకు.. ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ సీనియర్లే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates