టీడీపీ నాయకులు సంబరాలు చేసుకునే వార్త ఇది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యకు తాజాగా పార్టీ అధినే త, సీఎం చంద్రబాబు పరిష్కారం చూపించారు. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇప్పటి వరకు కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది. అయితే.. నియోజకవర్గ స్థాయిలో ప్రధాన కార్యాలయంతోపాటు.. అనుబంధంగా ప్రధాన మండలాల్లో కార్యాలయాలు నిర్మించుకోవాలని సీనియర్లు కోరుతున్నారు.
ప్రస్తుతం అద్దె భవనాల్లో పార్టీ కార్యాలయాలు నడుస్తున్నాయి. రాజధాని అమరావతి పక్కనే ఉన్న మంగ ళగిరిలో కేంద్ర కార్యాలయం ఉన్నా.. అనుబంధంగా మరో జిల్లాస్థాయి కార్యాలయం లేదు. ఉన్నా.. అది అద్దె భవనంలో సాగుతోంది. ఎక్కడో ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే అనుబంధ కార్యాలయాలు నడుస్తు న్నాయి. దీంతో ఎమ్మెల్యేలు కొందరు ఎన్నికల సమయంలో ప్రతి మండలం పరిధిలో ఒక కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత.. వాటిని మూసేస్తున్నారు.
గెలిచినా.. ఓడినా.. కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలన్నా.. పార్టీ కార్యక్రమాలు చేపట్టాలన్నా.. ఏదైనా కల్యాణ మండపమో.. లేదాఫంక్షన్ హాలో బుక్ చేసుకునే పరిస్థితి ఇప్పటి వరకు కొనసాగుతోంది. ఇలా కాకుండా.. సుస్థిరంగా ప్రతి జిల్లాలోనూ రెండు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నాయకులు కోరుతు న్నారు. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో ఇలానే.. ఏర్పాటు చేసుకున్నారని.. ప్రతి జిల్లాలోనూ ఒక ప్రధాన కార్యాలయం.. అనుబంధంగా మరో కార్యాలయం సొంతగానేనిర్మించుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో మనకు కూడా జిల్లాకు రెండేసి కార్యాలయాలు నిర్మించుకునేలా స్థలాలు కేటాయించాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా దీనిపై చర్చించిన చంద్రబాబు.. జిల్లాల పరిధిలో వివాదం కాని భూములు, ప్రబుత్వానికి చెందిన భూములను గుర్తించాలని.. వాటిని పార్టీకి కేటాయించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వాటిని లీజు లేదా.. విక్రయం ద్వారా పార్టీకి కేటాస్తారు. తద్వారా.. స్థానిక నాయకులు వాటిని స్వాధీనం చేసుకుని నిర్మించాల్సి ఉంటుంది. నిర్మాణానికి 50 శాతం నిధులను పార్టీ సమకూర్చనుంది. మిగిలిన వాటిని.. చందాల రూపంలో వసూలు చేయనున్నారు.
This post was last modified on August 5, 2025 3:38 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…