తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో నానాటికీ ముసురు ముదురుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం సొంత పార్టీపై… ప్రత్యేకించి నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీశ్ రెడ్డిని లిల్లీపుట్ నేత అంటూ వ్యాఖ్యానించిన కవిత, ఆ లిల్లీపుట్ నేత కారణంగానే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ లేనంత హీన స్థితికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ మీడియా సమావేశంలో “కవిత ఎవరు?” అంటూ జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న కవిత ఆదివారం జగదీశ్ రెడ్డిని ఏకంగా లిల్లీపుట్ అంటూ హేళన చేశారు. అంతేకాకుండా, కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ ఎక్కడ ఉండేవారు అని కూడా ఆమె ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో తన సీటును మాత్రం గెలుచుకున్న ఆ లిల్లీపుట్ నేత, జిల్లాలోని మిగిలిన అన్ని సీట్లలో పార్టీ అభ్యర్థుల పరాజయానికి కారణమయ్యారని ఆమె ఆరోపించారు.
ఇక ఇంటి ఆడపడచుపైనే లిల్లీపుట్ లాంటి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే బీఆర్ఎస్ సోదరుల నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారణం ఆ లిల్లీపుట్ నేత వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడు ఉన్నారని కూడా ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఆ బడా నేత ఏది చెబితే, లిల్లీపుట్ నేత అదే మాట్లాడతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఆడపడచులపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు.
ఇదిలా ఉంటే… జగదీశ్ రెడ్డిపై ఇటీవల పలువురు నేతలు కవిత తరహా వ్యాఖ్యలే చేస్తుండటం గమనార్హం. మొన్నామధ్య స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి… నల్లగొండ జిల్లాకు చెందిన “ఆ మూడు అడుగుల రెడ్డి” అంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ఆ తర్వాత పలువురు తెలంగాణ మంత్రులు కూడా జగదీశ్ రెడ్డిపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత, జగదీశ్ రెడ్డి పేరు ఎత్తకుండానే ఆయనను ఏకంగా లిల్లీపుట్ అంటూ సంబోధించడం గమనార్హం.
This post was last modified on August 5, 2025 8:06 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…