తెలంగాణలో సోమవారం అటు అధికార పక్షం కాంగ్రెస్ తో పాటు ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు అత్యంత ప్రత్యేకమైన రోజు అని చెప్పుకున్నాం కదా. అలాంటి ప్రత్యేకమైన రోజే బీఆర్ఎస్ కు, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు గట్టి షాక్ తగిలింది. ఆది నుంచి పార్టీ క్రియాశీలకంగా పనిచేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన నేరుగా కేసీఆర్ కే పంపారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉండగా… 2003 అసెంబ్లీ ఎన్నికలకు కాస్తంత ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా రాజకీయ ఫిరాయింపులకు సంబంధించిన బేరసారాలు జరుగుతున్నాయన్న వార్తలు పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇలా పార్టీ మారే వారిలో రోహిత్ రెడ్డితో పాటు గువ్వల బాలరాజు కూడా ఉన్నారన్న వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత ఆ వాదనలన్నీ తప్పని తామే స్టింగ్ ఆపరేషన్ చేశామంటూ బాలరాజు బృందం చెప్పింది.
ఇదిలా ఉంటే… దళిత సామాజిక వర్గానికి చెందిన బాలరాజు బీఆర్ఎస్ లో ఆది నుంచి క్రియాశీలకంగానే ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డార జరిగిన ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై 2018లోనూ ఆయన అదే స్థానం నుంచి విజయం సాధించారు. పార్టీ అధిష్టానం వద్ద మంచి పేరును సంపాదించుకున్న బాలరాజు ఇప్పుడు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates