తెలంగాణలో సోమవారం నిజంగానే ఓ ప్రత్యేకమైన రోజు అని చెప్పక తప్పదు. ఎందుకంటే… రోజుల తరబడి సాగిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు అయిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా… దానిపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సమీక్షించింది. అదే సమయంలో కేబినెట్ లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న దానిపై కేబినెట్ భేటీకి ముందే బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్… తన ఎర్రవలి ఫామ్ హౌస్ లో పార్టీకి చెందిన కీలక నేతలతో సుదీర్ఘ చర్చ జరిపారు.
ఒకే రోజు ఇటు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ, అదే సమయంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం జరిగిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందా? అని తెలంగాణ జనంతో పాటు ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా గమనించారు. అయితే పెద్దగా కీలక నిర్ణయాలేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బీఆర్ఎస్ నేతలు అయితే బతుకు జీవుడా అంటూ చల్లబడిపోయారు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సర్కారు… ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇంకా ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతోంది.
సోమవారం ఉదయం ఎర్రవలి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన కేసీఆర్ సమీక్షకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కమలాకర్, శ్రీనివాస యాదవ్ తదితరులతో పాటు పార్టీకి చెందిన చాలా మంది కీలక నేతలు హాజరయ్యారు. సమావేశం సుదీర్ఘంగా జరగగా… కాంగ్రెస్ సర్కారు ఇందులో పొడిచేదేమీ లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. అదే సమయంలో కాళేశ్వరంలో రాష్ట్రంలో లక్ష ఎకరాలకు నీళ్లిచ్చిన విషయాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు.
సరిగ్గా బీఆర్ఎస్ సమావేశం ముగిసే సమయానికి హైదరాబాద్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మంత్రులంతా హాజరైన ఈ భేటీలో ప్రదానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపైనే చర్చ జరిగింది. ముందుగా సీఎస్ నివేదికపై వివరణ ఇవ్వగా… ఆ తర్వాత సాగునీటి శాఖ మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ లతో పాటు పలు ఇంజినీరింగ్, సాగు నీటి శాఖ అదికారులకు ప్రత్యక్ష పాత్ర ఉందని ఆయన తెలిపారు. మరి వీరిపై ఏ రీతిన చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చలు జరిపారు.
ఓ మాజీ సీఎంపై చర్యలు తీసుకోవాలంటే… అది కూడా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలంటే క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటే సరిపోదన్న భావన కేబినెట్ బేటీలో వ్యక్తం అయ్యింది. దీంతో కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడంతో పాటు దానిపై సుదీర్ఘమైన చర్చ జరిపి.. కేసీఆర్ చేసిన అక్రమాలను జనం ముందు ఉంచి అప్పుడు చర్యలు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
This post was last modified on August 4, 2025 11:39 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…