ఏపీలో జనసేన పార్టీ తరఫున ఇద్దరు నాయకులు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. వీరిలో మచిలీ పట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. అయితే.. బాలశౌరి ఇప్పుడు వివాదంలో చిక్కుకు న్నారు. ఎంపీ లెటర్ హెడ్‌లు, అప్పాయింట్‌మెంటు లెటర్లను నకిలీవి సృష్టించి.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి గోపాల్ సింగ్ సుమారు 60-70 మంది నిరుద్యోగుల నుంచి కోటిన్నర రూపాయల వరకు మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం నియోజకవర్గంలో కాక రేపుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున బాధితులు ఎంపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
ఏం జరిగింది?
ఎంపీ బాలశౌరికి పర్సనల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న గోపాల్ సింగ్.. ఎంపీ పేరుతో నకిలీ అప్పాయింట్‌మెంటు లెటర్లు, లెటర్ హెడ్‌లు సృష్టించారు. వీటిని ఆసరాగా చేసుకుని నిరుద్యోగులను ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎంపీ సిద్ధంగా ఉన్నారని.. అప్లయి చేసుకోవాలని సోసల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిని నమ్మిన 60 నుంచి 70 మంది నిరుద్యోగులు.. ఆ లెటర్ హెడ్ల, అప్పాయింట్లను ఆధారంగా చేసుకుని ఒక్కొక్కరు రూ.2 లక్షల చొప్పున ఫండ్ కింద చెల్లించారు. ఇలా ఇచ్చిన వారికే ఎంపీ ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ.. గోపాల్ సింగ్ ప్రచారం చేయడంతో వారు నిజమేనని నమ్మారు.
చివరకు ఈ నెల 1న విజయవాడలో ఇంటర్వ్యూలు ఉన్నాయని.. సొమ్ములతో రావాలని కొందరికి గోపాల్ సింగ్ కబురు పెట్టారు. దీంతో అక్కడికి రాకముందే.. వారి నుంచి ఆయన ఫోన్ పే సహా.. ఇతర మార్గాల్లో సొమ్ములు రాబట్టారు. చివరకు విజయవాడ కు వచ్చిన బాధిత నిరుద్యోగులకు మొహం చాటేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన.. బాధితులు.. గోపాల్ సింగ్ ఇచ్చిన అప్పాయింట్‌మెంటు లెటర్లు, లెటర్ హెడ్‌లో మచిలీపట్నంలోని ఎంపీ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీ బాలశౌరి సహా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల నుంచి లెటర్ హెడ్‌లు, అప్పాయింట్‌మెంటు లెటర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నకిలీ పత్రాలుగా గుర్తించారు. కొందరు తాము చెల్లించిన నగదుకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులకు అందించారు. కాగా.. గత రెండు రోజులుగా గోపాల్ సింగ్ ఆఫీసుకు కూడా రాలేదని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుపై ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు.. బాలశౌరి ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించలేదు.
This post was last modified on August 2, 2025 7:10 pm
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…