Political News

రెడ్ల‌లో సింప‌తీ ఎందుకు రాలేదు…

స‌హజంగానే రాజ‌కీయాలు సామాజిక వ‌ర్గాలకు అనుకూలంగా మారాయి. ఎవ‌రు కాద‌న్నా.. ఔన‌న్నా.. సామాజిక వ‌ర్గాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. మ‌రీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గం అంటే.. వైసీపీ, క‌మ్మ వ‌ర్గం అంటే టీడీపీ అనుకునే ప‌రిస్థితి ద‌శాబ్దంన్న‌ర నుంచి క‌నిపిస్తోంది. అయితే.. క‌మ్మ సామాజిక వ‌ర్గంలో ఉన్న ఐక్య‌త‌.. రెడ్డి వ‌ర్గంలో క‌నిపించ‌డంలేదు.

2019 ఎన్నిక‌ల‌కు ముందు రెడ్డి వ‌ర్గం ఏక‌మైంది. కానీ.. త‌ర్వాత‌.. జ‌గ‌న్ త‌మ‌కు ఏమీ చేయ‌లేక‌పోయార‌న్న వాద‌న‌, ఆవేద‌న‌తో ఆ వ‌ర్గం దూర‌మైంది.

ఆ ప‌రిణామాలే.. 2024 ఎన్నిక‌ల్లో టీడీపీకి రెడ్డి సామాజిక వ‌ర్గం క‌నెక్ట్ అయ్యేలా చేశాయ‌న్న వాద‌న‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఏడాది త‌ర్వాత కూడా రెడ్డి వ‌ర్గం వైసీపీకి దూరంగానే ఉండ‌డం.. క‌నీసం వారిలో సింప‌తీ కూడా క‌నిపించక‌పోవడం వంటివి వైసీపీలో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన న‌లుగురు కీల‌క నాయ‌కుల‌ను మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అరెస్టు చేసింది. వీరిలో జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే.. రాజ్ క‌సిరెడ్డి, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు.

అయితే.. మిథున్‌రెడ్డి అరెస్టు త‌ర్వాత‌.. ఆయ‌న తండ్రి, పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని ఐక్యం చేసి.. ప్ర‌భుత్వంపై పోరాటాలు చేసేలా.. విమ‌ర్శ‌లు గుప్పించేలా చేయాల‌ని భావించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

పుంగ‌నూరులో రెడ్డివ‌ర్గాన్ని ఐక్యం చేసేందుకు కూడా ఆయ‌న ప్ర‌య‌త్నించార‌ని తెలిసింది. రాజ‌కీయ కుట్ర‌లో భాగంగానే త‌న కుమారుడిని అరెస్టు చేయించార‌ని.. జైల్లో పెట్టించార‌ని పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్లంతా ఏకమై, దీనిని ఖండించాల‌న్న‌ది పెద్దిరెడ్డి ఉద్దేశం. కానీ, పెద్దిరెడ్డి అనుకున్న‌ట్టుగా ఆయ‌న ఆశించిన‌ట్టుగా ఏదీ జ‌ర‌గ‌లేదు. పైగా.. ఎవ‌రూ కూడా మిథున్‌రెడ్డి విష‌యాన్ని ప్ర‌స్తావించేందుకు ముందుకు రాలేదు.

ప‌క్కా ఆధారాలు ఉన్నాయ‌ని సిట్ అధికారులు చెబుతుండ‌డంతోపాటు.. కేసు కూడా విచార‌ణ ద‌శ‌లో ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు మిథున్ రెడ్డిని స‌మ‌ర్ధించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌న్న వాద‌న..

అధికారంలో ఉన్న‌ప్పుడు.. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ముందుకు రాని పెద్దిరెడ్డి.. ఇప్పుడు త‌న కుటుంబ స‌మ‌స్య‌ను రెడ్డి వ‌ర్గంపై రుద్దుతున్నార‌న్న చ‌ర్చ కూడా ఉంది.

అందుకే రెడ్డి సామాజిక వ‌ర్గంలో సింప‌తీ క‌రువైంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 1, 2025 9:18 am

Share
Show comments
Published by
Kumar
Tags: YCP

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago