Political News

‘జ‌గ‌న్ అవినీతి శాస్త్ర‌వేత్త..’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఏపీ అధికార పార్టీ టీడీపీ, అదేవిధంగా కాంగ్రెస్ కీల‌క నాయ‌కులు ఒకే రోజు విరుచుకుప‌డ్డారు. విమ‌ర్శ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌, టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఏక‌కాలంలో జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగారు. ఇద్ద‌రు వేర్వేరుగా స్పందించినా.. ఒకే అంశంపై జ‌గ‌న్‌పై దుయ్య‌బ‌ట్టారు. మ‌ద్యం కుంభ‌కోణాన్ని సెంట్రిక్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు.

మాణిక్కం ఏమ‌న్నారంటే..

2019-24 మ‌ధ్య ఏపీలో దారుణ‌మైన పాల‌న సాగింద‌ని మాణిక్కం అన్నారు. జ‌గ‌న్ ఓ అవినీతి శాస్త్ర‌వేత్త అని వ్యాఖ్యానించారు. అవినీతి ఎలా చేయాలో.. సొమ్మును ఎక్క‌డ దాచాలో.. ఎలా దారి మ‌ళ్లించాలో.. జ‌గ‌న్‌కు తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు. అవినీతి ముఠాను మంత్రులుగా చేసుకుని రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను కూడా దోచుకున్నార‌ని ఆరోపించారు. మ‌ద్యం కేసులో 11 కోట్ల రూపాయ‌లు ల‌భించాయ‌ని.. ఇవి జ‌గ‌న్‌కు అందాల్సిన సొమ్ముగానే తాము భావిస్తున్నామ‌న్నారు.

ఈ మ‌ద్యం కేసులో 3500 కోట్ల అవినీతి జ‌రిగింద‌న్నారు. ఈ సొమ్ము ఎక్క‌డెక్క‌డికి మ‌ళ్లించారో తేల్చాల్సిన బాధ్య‌త ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) పైనే ఉంద‌న్నారు. ఈ సొమ్ముతోనే సినిమాలు తీశార‌ని.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశార‌ని.. పెట్టుబ‌డులు పెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. జ‌గ‌న్ అవినీతి శాస్త్ర‌వేత్త కాబ‌ట్టే.. ఆయ‌న అవినీతిలో ఆరితేరిపోయార‌ని మాణిక్కం చెప్పారు.

ఇక‌, టీడీపీ సీనియ‌ర్ నేత‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మ‌రో అడుగు ముందుకు వేశారు. మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అస‌లు దోషి జ‌గ‌నేన‌ని చెప్పారు. ప‌ట్టుకుని నాలుగు త‌గిలిస్తే.. అన్ని నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి అంటూ.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దొంగ‌ల‌ను ప‌రామ‌ర్శిస్తున్న జ‌గ‌న్‌.. త‌న అవినీతి పాపానికి బ‌లై జైలు పాలైన వారి కుటుంబాల‌ను ఎందుకు ప‌రామ‌ర్శించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ వారి ఇళ్ల‌కు వెళ్తే.. మ‌హిళ‌లు చీప‌ర్లు, చాట‌లు తిర‌గేస్తార‌ని ఆరోపించారు.

This post was last modified on July 31, 2025 7:50 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jagan

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

5 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

6 hours ago