తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పటి కే మంత్రులుగా అవకాశం చిక్కని చాలా మంది నాయకులు అసంతృప్తితో రగులుతున్నారు. ఈ క్రమంలో వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాన్స్ చిక్కితే అప్పుడు సీఎం రేవంత్‌పై విమర్శలు చేసేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాలమూరులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవం త్ చేసిన వ్యాఖ్యలు వారికి ఆయుధంగా మారాయి.
పాలమూరులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. 2034 వరకు పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పారు. ఒకానొక దశలో తానే పదేళ్లపాటు ముఖ్య మంత్రిగా ఉంటానన్నారు. ఈ వ్యాఖ్యలే సొంత పార్టీలో రాజకీయ మంటలు పుట్టించాయి. తాజాగా ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు ఇతర నేతలు కూడా ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించా రు. అలా ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి అయితే.. మరో అడుగు ముందుకు వేశారు.
కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయమే కీలకమన్న ఆయన.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసు కోవాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని రాజగోపాల్ చెప్పారు. రేవంత్ ను ముఖ్యమంత్రి చేసింది కూడా.. పార్టీ అధిష్టానమేనని.. అన్నీ హైకమాండ్ చెప్పినట్టే జరుగుతాయని.. అలాంటప్పుడు తానే పదేళ్లు ముఖ్యమం త్రిగా ఉంటానని ఎలా చెబుతారని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ కు ఆయన ముఖ్యమంత్రి మాత్రమేనని చెప్పారు. అంతే తప్ప.. పార్టీని వ్యక్తిగత సామాజ్యంగా మార్చుకోవాలని చూస్తే.. పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి నిఖార్సయిన నాయకులు, కార్యకర్తలు.. దశాబ్దాలుగా సేవ చేస్తున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలను వారు ఎంత మాత్రం సహించబోరని కోమటి రెడ్డి చెప్పారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…