Political News

వీర్రాజు మరీ ఇంతలా మారిపోయారా

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే.. ఉప్పు-నిప్పుగా వ్య‌వ‌హ‌రించే బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ మాజీ చీఫ్‌.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. తాజాగా బాబు స‌హా.. మంత్రి నారా లోకేష్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా వైసీపీ పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. జ‌గ‌న్ పాల‌న‌ను ఎండ‌గ‌ట్టారు. అంతేకాదు.. మ‌ళ్లీ వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అనుకోవ‌డం క‌ల్లేన‌ని తేల్చేశారు. అరాచకాలు.. అకృత్యాల‌తో సాగిన పాల‌న‌ను ప్ర‌జ‌లు ఇంకా మ‌రిచిపోలేద‌ని త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు వీర్రాజు. ఇదేస‌మ‌యంలో ఆయ‌న చంద్ర‌బాబు భారీ క్లూ కూడా ఇచ్చారు. వైసీపీపై కేసులు పెట్ట‌డంలో స‌ర్కారుకు ఈ క్లూ మ‌రింత ఉప‌యోగ‌నుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు యువ‌గ‌ళం పేరుతో పాద‌యాత్ర నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ స‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు అడ్డంకులు సృష్టించారు. అప్ప‌ట్లోనే నారా లోకేష్ రెడ్ బుక్‌ పేరుతో వారిని హెచ్చ‌రించారు. అయితే.. తాజాగా సోము వీర్రాజు.. ఆనాటి సంగ‌తులు గుర్తు చేశారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌మ‌యం లో వైసీపీ నాయ‌కులు కుట్ర‌లు చేశార‌ని.. నారా లోకేష్‌ను లేకుండా చేసే ప్ర‌య‌త్నాలు కూడా సాగిన‌ట్టు త‌న‌కు స‌మాచారం ఉంద‌ని చెప్పారు.(అయితే అప్ప‌ట్లో ఎందుకు చెప్ప‌లేదో ఆయ‌న స‌మాధానం ఇవ్వ‌లేదు).

ఈ నేప‌థ్యంలో ఆనాడు యువ‌గ‌ళం పాద‌యాత్ర జ‌రిగిన ప్రాంతాల్లో వైసీపీ నాయ‌కులు సృష్టించిన అడ్డంకుల‌పై తాజాగా దృష్టి పెట్టాల‌న్నారు. నాడు.. జ‌రిగిన అక్ర‌మాలు, అరాచ‌కాల‌పై ముఖ్యంగా యువ‌గ‌ళం పాద‌యాత్ర‌పై జ‌రిగిన కుట్ర‌ల‌ను వెలికి తీయాల న్న‌ది వీర్రాజు చెబుతున్న మాట‌. ఇది నిజ‌మే. ఈ ఆలోచ‌న బ‌హుశ ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీనాయ‌కుల‌కు కూడా రాలేదు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అరెస్టులు.. పెట్టిన కేసులు గ‌మ‌నిస్తే.. సోష‌ల్ మీడియాలో చేసిన వ్యాఖ్య‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై జ‌రిగిన హ‌త్యా య‌త్నాల‌కు మాత్ర‌మే సంబంధించి ఉన్నాయి. ఈ కేసుల్లోనే వైసీపీ నాయ‌కులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

This post was last modified on July 20, 2025 5:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago