ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి చీపురు పట్టారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. ప్రతి నెలా మూడో శనివారం రాష్ట్రంలో నిర్వ హిస్తున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం చంద్రబాబు.. తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కపిలేశ్వరస్వామి(తిరుమల అలిపిరి వద్ద ఉంటుంది) ఆలయాన్ని సందర్శించారు. తొలుత స్వామిని దర్శించిప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. అక్కడే పారిశుధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి పరిసరాలను పరిశుభ్రం చేశారు. సుమారు గంటన్నర పాటు.. పరిశరాలను ఆయన శుభ్రం చేసి..కార్మికులతో కలివిడిగా మాట్లాడారు.
వారి సమస్యలు తెలుసుకున్నారు. గతంలోనూ.. సీఎం చంద్రబాబు.. పారిశుద్ధ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మూడో శనివారం ఏదొ ఒక జిల్లాను ఎంపిక చేసుకుని అక్కడ పర్యటించి.. పారిశుధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతు న్నారు. ప్రధానంగా.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, అనంతపురం వంటి ముఖ్య జిల్లాల్లో నిషేధించారు. అయితే.. ఇది అక్టోబరు 2 నుంచి అమలు చేయనున్నారు. ఈ మధ్య కాలంలో దీనిపై ప్రజల కు సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై కూడా చంద్రబాబు స్థానికులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించామన్నారు. తద్వారా భూతాపాన్ని తగ్గిం చేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. దీనిని అందరూ అర్ధం చేసుకోవాలని, అక్టోబరు 2 తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే పరిశ్రమలు.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చా క.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కేంద్రం 5 ప్రతిష్టాత్మక అవార్డులు తమకు ఇచ్చిందన్నారు.
This post was last modified on July 20, 2025 5:49 am
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…