తనను సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచారని.. బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో గత 2023 ఎన్నికల్లో జరిగిన పరిణామాలు సహా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కూడా వివరించారు. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు.. ఆయనకు మధ్య వివాదాలు ముసురుకున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్‌లో ఈటలకు చెక్ పెట్టే విధంగా మంత్రి వ్యవహరిస్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
2023 ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి తాను పోటీ చేసినప్పుడు.. సొంత పార్టీ నాయకులే తనకు వెన్నుపోటు పొడిచారని ఈటల వ్యాఖ్యానించారు. అయినా.. తాను ప్రజల మనసులు గెలుచుకుని ఎంపీగా విజయం దక్కించుకున్నానన్నారు. వ్యక్తుల పై తాను ఎప్పుడూ ఆధారపడలేదన్న ఆయన.. పార్టీని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని చెప్పారు. కార్యకర్తలే తనకు కొండంత బలమని ఈటల వ్యాఖ్యానించారు. వారిని కూడా తనకు దూరం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు.
తనపైనా.. తన కుటుంబంపైనా కూడా.. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తూ.. తన ఇమేజ్‌కు భంగం కలిగించేలా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే..ఎక్కడా ఎవరి పేరును ఈటల ప్రస్తావించలేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి చాలానే కారణాలు ఉన్నాయన్నారు. అయితే..ఎక్కడ ఉన్నా.. ఆ పార్టీ బాగుండాలని.. కార్యకర్తలు ప్రజలు బాగుండాలని తాను కోరుకుంటానని ఈటల వ్యాఖ్యానించారు. తాను పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదన్నారు. పదవుల కోసం పార్టీలు మారలేదని చెప్పారు.
“గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌కు నా నిర్ణయాలు మొహమాటం లేకుండా చెప్పాను. గతంలో హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ప్రజల ఆత్మగౌరవం గెలిచింది. నేను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తున్నా. కానీ.. కొందరికి ఇది నచ్చడం లేదు. అయినా.. నేను ప్రజలనే నమ్ముకున్నా.. నా కార్యకర్తలే నాబలం” అని ఈటల తేల్చి చెప్పారు.
This post was last modified on July 19, 2025 2:43 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…