రాజకీయాల్లో ఓర్పు.. నేర్పు చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రత్యర్థులు పన్నే వలకు చిక్కకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం కూడా నాయకులకు ఉంటుంది. ఈ విషయంలో ఏ చిన్న తేడా జరిగినా .. ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు వైసీపీ నాయకుల పరిస్థితి.. ప్రత్యర్థి బుట్టలో పడినట్టు కనిపిస్తోంది. సాధారణంగా.. ఎవరు అధికారంలో ఉంటే.. వారు ప్రత్యర్థులను రెచ్చగొట్టడం అనేది కామన్. ఇది దేశవ్యా ప్తంగా అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను రెచ్చగొట్టలేదా?
ఇప్పుడు వైసీపీని కూడా అదే తరహాలో టీడీపీ నాయకులు రెచ్చగొడుతున్నారన్నది వాస్తవం. అది పార్టీ నాయకులను కావొచ్చు.. పార్టీని కావొచ్చు. పార్టీ అధినేతను కావొచ్చు. ఇలాంటి సమయంలో సంయమనం చాలా ముఖ్యం. లేకపోతే.. రాజకీయ రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. ప్రతిపక్షంలో ఉన్నవారికి మాత్రం చాలా ఓర్పు, నేర్పు ఉండాల్సి ఉంటుం ది. అదే ఇప్పుడు వైసీపీకి కొరవడుతోంది.
రప్పా రప్పా.. నుంచి నరికేస్తాం.. వరకు వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు కారణం.. అధికార పార్టీ నుంచి వస్తున్న ఫ్రస్ట్రేషన్ అనేది అందరికీ తెలిసిందే. అయితే.. ఈ విషయంలో కనుక వైసీపీ ఇలానే ముందుకు సాగితే… ప్రజల మధ్య మరింత చులకన అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నా రు. ఇప్పటికే జగన్ ఇమేజ్ డ్యామేజీ అయిన నేపథ్యంలో ఆయన మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఉదాహరణకు సినిమా డైలాగులను ఆయన సమర్థించారు.
కానీ.. సమాజం.. మాత్రం జగన్ అనుకున్నట్టుగా అయితే.. అంత చెడిపోలేదు. సినిమాల్లో వినేందుకు.. ఆ యా డైలాగులు పరిమితమే.. తప్ప.. నేరుగా బయట ఎవరూ వాటిని పుణికి పుచ్చుకోలేదు. సో.. జగన్ ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప.. సినిమా డైలాగులతో రాజకీయాలు చేస్తామంటే హర్షించే సమాజం అయితే.. లేదు. ఇది పార్టీకే కాదు.. జగన్‌కు కూడా ఇబ్బందులు తెస్తుంది. కాబట్టి.. భవిష్యత్తు రాజకీయాలు చేరువ కావాలన్నా.. అధికారం కావాలన్నా.. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తే తప్ప.. ముందుకు సాగే పరిస్థితి లేదన్నది వాస్తవం.
This post was last modified on July 19, 2025 6:36 am
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్‌కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…