తొలిసారి విజయం దక్కించుకున్న వారిలో పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నారు. వీరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. అయితే.. పదవులతో పనిలేకుండా.. ప్రజలకు చేరువ అవుతున్న యువ ఎంపీగా.. తొలిసారి విజయం దక్కించుకున్నా.. తండ్రి బాటలో నడుస్తూ.. ప్రజలకు చేరువ అవుతున్న నాయకుడిగా.. పేరు తెచ్చుకుంటున్నారు అమలాపురం ఎంపీ గంటి హరీష్. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి హవాకు తోడు.. యువ నేతగా ఆయన ప్రజలకు చేరువయ్యారు. ఫలితంగా గెలుపు గుర్రం ఎక్కారు.
ఢిల్లీ పాలిటిక్స్‌లోనూ ఆయన అనుభవం గడిస్తున్నారు. నియోజకవర్గం సమస్యలపై ఆకళింపు చేసుకున్న హరీష్.. గతంలో తన తండ్రి మోహన్‌చంద్ర బాలయోగి.. ఏవిధంగా ప్రజలకు చేరువయ్యారో.. ఇప్పుడు ఆయన కూడా అదే తరహాలో ప్రజలకు చేరువ అవుతున్నారు. ఎస్సీ నియోజకవర్గం అయిన అమలాపు రంలో భిన్నమైన రాజకీయాలు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ఎంపీల నుంచి రాజకీయ విమర్శలు వస్తుం టాయి. అయితే.. వాటిపై ఎంత మేరకు స్పందించాలో.. అంత వరకే స్పందించి.. మిగిలిన విషయాలను పక్కన పెడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో కలిసి పనులు, ప్రణాళికలు నిర్మించడంలోనూ.. హరీష్ మాధుర్ ముందున్నారు. నారా లోకేష్ టీంలో సభ్యుడిగా ఉన్నారన్న ప్రచారం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆయన ప్రజలకు చేరువ అవుతు న్నారు. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదేసమయంలో కూటమి పార్టీల నాయకులతోనూ మంచి సత్సంబంధాలను నెలకొల్పారు.
కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకానొక దశలోపార్లమెంటు డిప్యూటీ స్పీకర్ పదవిలోనూ ఆయన పేరు వినిపించడం గమనార్హం. అయితే.. కొన్ని కారణాలతో ఈ పదవిని భర్తీ చేయలేక పోయారు. ఇప్పుడు కాకపోతే.. భవిష్యత్తులో అయినా.. ఆయనకు పార్లమెంటు స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉంటుందన్న చర్చ ఉంది. దీనికి కారణం.. అందరినీ కలుపుకొని పోవడం.. ఇతర భాషల్లోనూ పట్టు, ముఖ్యంగా పార్టీ పట్ల అంకిత భావం వంటివి హరీష్ మాధుర్‌ను తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు సాగేలా చేస్తున్నాయి. వివాదాలకు కడుదూరంగా కూడా ఉంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates