ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల ను చర్చించేందుకు.. ఆయన వెళ్లారని సీఎంవో వర్గాల చెబుతున్నాయి. రైతులకు మద్దతు ధరలు, విపక్ష నేత జగన్ వ్యవహారం .. సహా అమరావతి రాజధానిలో నిర్మాణాలు.. అదనపు భూ సమీకరణ వంటి వాటిపై గవర్నర్‌తో చర్చించినట్టు తెలిసింది. అయి తే.. వీటితోపాటు.. కీలకమైన మంత్రి వర్గ విస్తరణపైనే ప్రధానంగా చంద్రబాబు గవర్నర్‌తో భేటీ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత.. రాష్ట్రంలో మంత్రివర్గాన్ని మార్చే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్‌తో చంద్రబాబు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గత రెండు కేబినెట్ భేటీల నుంచి కూడా.. మంత్రి వర్గం పనితీరుపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు సరిగా పనిచేయడం లేదని.. బలమైన వాయిస్ వినిపించడం లేదని కూడా ఆయన చెబుతున్నారు. ఇటీవల అయితే..మరింత సీరియస్‌గానే మంత్రులకు తేల్చి చెప్పారు. దీంతో ఒకరిద్దరు పనిచేయని.. మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉందని మీడియా కథనాలు కూడా వస్తున్నాయి.
దీనికితోడు.. జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చెప్పి చాలా నెలలు గడిచింది. ఈ క్రమంలో ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోవాల్సి ఉంది. ఇతర మంత్రులను తొలగించినా.. తొలగించక పోయినా.. కొత్తగా నాగబాబుకు మాత్రం అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ఈ వ్యవహారంపై అబ్దుల్ నజీర్‌తో చర్చించేందుకు వెళ్లారన్నది టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అదేవిధంగా ఏడాది పాలన తర్వాత.. గవర్నర్‌ను కలుసుకోవడం ఇదే ప్రథమం కావడం.. రాష్ట్రంలో తల్లికి వందనం పథకంపై ఆయన వివరించినట్టు తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates