వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఏ విధంగా వ్యవహరించిందీ అందరికీ తెలిసిందే. వాస్తవానికి 2014 -2019 మధ్య విపక్షంలో ఉన్న వైసిపి అమరావతి రాజధానికి మద్దతు పలికి, అసెంబ్లీ సాక్షిగా రాజధానికి అనుకూలంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం నాలుగో దఫా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అసెంబ్లీ సాక్షిగా దీనిని నిరూపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతి రాజధానికి మద్దతిస్తున్నామని, 33 వేల ఎకరాలు చాలదు.. మరింత తీసుకోవాలని చెప్పిన విషయాన్ని కూడా అసెంబ్లీలో టెలికాస్ట్ చేసి చూపించారు.
కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా అటక ఎక్కించడంతోపాటు మూడు రాజధానుల జపాన్ని పాటించారు. ఫలితంగా అమరావతి రైతులకు ఇవ్వవలసిన రిటర్నబుల్ ఫ్లాట్లు సహా వారికి ఇవ్వవలసిన కౌలు సహా విద్య వైద్య రంగాల్లో ఉచిత సేవలను పూర్తిగా విస్మరించారు. ఇది ఒక భాగం అయితే.. ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా జగన్ పాపం, ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలు వంటివి రాజధానిని, రాజధాని రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రైతులకు ఇవ్వవలసిన ఆర్థిక ప్రయోజనాలను తొక్కి పెట్టిన కారణంగా ఇప్పుడు వాటిని వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.
దీనివల్ల సుమారు 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం పై అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా అంతర్జాతీయ విమానాశ్రయం ఇతర పెట్టుబడిదారుల సంస్థలకు కేటాయించాలని నిర్ణయించుకున్న భూములకు సంబంధించి మరిన్ని భూములను సేకరించే ప్రక్రియ కూడా జగన్ కారణంగా వెనకబడుతోంది. గతంలో భూములు తీసుకున్న రైతులకు ఇప్పటివరకు న్యాయం చేయలేదని, ఇప్పుడు తమ నుంచి తీసుకునే భూములకు ఏ మేరకు న్యాయం చేస్తారని రైతులు ప్రశ్నించటం వెనుక ఇదే కారణం స్పష్టంగా కనిపిస్తుంది.
దీనికి ప్రభుత్వం వైపు నుంచి కూడా సమాధానం స్పష్టంగా కనిపించడం లేదు. మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది అని చెబుతున్నా.. రైతుల్లో మనసికంగా ఆందోళన అయితే నెలకొంది. దీనిని తొలగించి కూటమి పార్టీలు గట్టిగా నిలబడి రైతులకు హామీ ఇస్తే తప్ప మరో 44 వేల ఎకరాల భూములను సేకరించాలి లేదా సమీకరించాలి అని పెట్టుకున్న లక్ష్యం ముందుకు సాగే అవకాశం అయితే కనిపించడం లేదనేది పరిశీలకులు చెబుతున్న మాట. ప్రస్తుతం అదనపు సమీకరణ విషయంలో ఒక్క టీడీపీ నాయకులు టిడిపి మంత్రులు మినహా కూటమిలోని బిజెపి, జనసేన నాయకులు ఎవరు జోక్యం చేసుకోకపోవడం వారు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం ప్రస్తుతం అనేక ప్రశ్నలకు కేరాఫ్ గా మారింది.
ఇది కూడా రైతుల ఆందోళనకు కారణంగా మారుతుంది. దీనిని బట్టి కూటమి నాయకులు ఐక్యంగా ఉండి రైతులను ఒప్పించగలిగితే అమరావతి రాజధానిని వెంటాడుతున్న జగన్ భయం తొలగిపోయి రైతులు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 8, 2025 5:15 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…